కరువు సమస్యపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది.
హైదారాబాద్: కరువు సమస్యపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. కరువు మండలాల అంశం పై ఆదివారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చజరిగింది. కరువుమండలాల ప్రకటనలో నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీసింది.
మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళనతో స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు.