
సాక్షి, యైటంక్లయిన్‌కాలనీ (కరీంనగర్): ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. కానీ జీవిత ప్రయాణంలో ఓడిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 11న రామగుండం రైల్వేస్టేషన్‌లో జంగటి అరుణ తన ఇద్దరు పిల్లలు సాత్విక్, సాత్వికను రైలు కిందికి తోసి తాను దూకింది. తల్లి కూతురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో కుమారుడు మృతిచెందాడు.
మృతురాలి భర్త జంగటి ప్రవీణ్ (32 )కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో ఒంటరితనం భరించలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు క్వాశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.