ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. : సీఎం కేసీఆర్ | Five months kattistam home ..: Chief KCR | Sakshi
Sakshi News home page

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. : సీఎం కేసీఆర్

Published Sat, Jan 10 2015 9:57 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. : సీఎం కేసీఆర్ - Sakshi

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. : సీఎం కేసీఆర్

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పేదలందరికీ పింఛను, రేషన్‌కార్డులు తప్పకుండా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ నగరంలో కేసీఆర్ మూడో రోజు పర్యటిస్తున్నారు.

గరీబ్‌నగర్‌లో సీఎం స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. గరీబ్‌నగర్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే ఇక్కడికి వచ్చానని చెప్పారు. గరీబ్‌నగర్ పేరు తీసి కాలనీకి అమీర్‌నగర్ అని పెట్టుకుందామని అన్నారు. గరీబ్‌నగర్‌లో కబ్జాలో ఉన్న అందరి స్థలాలు క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు. మీ దగ్గరికే అధికారులు వస్తారని ,అని వివరాలు సేకరిస్తారని చేప్పారు.

మురికివాడల్లో పక్కా గృహాలు నిర్మించే కార్యక్రమానికి రేపే శ్రీకారం అన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు.పేదల జీవనవిధానంలో ఇప్పటి వరకు మార్పు రాలేదు కనుకే ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అని సీఎం కేసీఆర్ అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement