సాక్షి, అమరావతి : కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది.
కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్ పాయింట్ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి.
ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు
సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో.. ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం
Comments
Please login to add a commentAdd a comment