
‘గాంధీ’లో అత్యవసర సేవలు బంద్
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సాధారణ విధులను బహిష్కరించిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు బుధవారం మధాహ్నం నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. వైద్యశాఖ మంత్రి, డీఎం ఈలతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవలను బహిష్కరిస్తున్నామని జూడాల సం ఘం ప్రతినిధులు అభిలాష్, క్రాంతిచైతన్యలు తెలి పారు. విధులను బహిష్కరించిన అనంతరం జూడాలు గాంధీ ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేపట్టి ‘చెవిలో పువ్వు’ కార్యక్రమం నిర్వహిం చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సమయంలో గాంధీ జూడా నరేష్ బ్యాగును పోలీసులు తనిఖీ చేయగా కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె దొరికాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మరికొంతమంది వద్ద పోలీసులు బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం అత్యవసర సేవలు అందక నలుగురు రోగులు మృతి చెందారు. కాగా, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలంటూ రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల విద్యార్థులు చేస్తు న్న ఆందోళన బుధవారం 31వ రోజుకు చేరింది.