కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్‌టేకర్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్‌కు అనుకూలం గా కేర్‌టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్‌టేకర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్‌ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.