Student associations
-
ఇకనైనా ఈ నిషేధం ఎత్తివేయాలి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్సిటీలలో, కళాశాలల్లో స్టూడెంట్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో ఉస్మానియా విశ్వ విద్యాలయ (Osmania University) అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో ఓ విద్యార్థి హత్య గావించబడ్డాడనే నెపంతో అప్పటి పాలకులు విద్యార్థి సంఘం ఎన్నికలపై (Student Polls) నిషేధం విధించారు.ఎనభయ్యో దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యా సంస్థల్లో ఈ ఎన్నికల నుండి ప్రేరణ, చైతన్యం పొంది ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపు తున్నారు. మరికొంత మంది విద్యా ర్థులు ప్రజల ఆకాంక్షలను సఫలం చేసేందుకు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు క్యాంపస్‌లలో స్టూడెంట్ బాడీ ఎన్ని కలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. విద్యార్థుల అకడమిక్ సమస్యలు, వసతి సమస్యలు పరిస్కారమయ్యేవి. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. నేడు విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి పరిష్కరించడం సవాలుగా మారింది.ఇటీవల కాలంలో విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందనీ, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఎన్నికలపై గత పాలకులు విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ... మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని అనడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి. అందుకు గతంలో జేఎమ్ లింగ్డో కమిటీ (JM Lyngdoh Committee) సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్డరుతో 2005 డిసెంబర్ 2వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎమ్ లింగ్డో అధ్యక్షతన ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీని... యూనివవర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించింది. 2006 మే 26న కమిటీ తన నివేదికను సమర్పించింది.ఈ నివేదిక ముఖ్య ప్రతిపాదనలుదేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రాతినిధ్యతో స్టూడెంట్ బాడీ/యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ కొరకు క్యాంపస్‌లలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాలి. నామి నేషన్ల స్వీకరణలో విద్యార్థుల అకడమిక్ ప్రతిభను పరిణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలను, ప్రెసిడెంట్ ఎన్నికలను నమూనా మోడల్‌గా తీసుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యార్థి సంఘం ఎన్నికలపై సమీక్ష జరగాలి. ఆఫీస్ బేరర్ల ఎన్నికలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ – ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ నమూనా పాటించాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు (student union elections) రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. యూనివర్సిటీ ఎన్నికలలో పాల్గొనే విద్యార్థుల తరగతిగది హాజరు 70% ఉండాలి.చదవండి: చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!ఈ నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. దాంతో, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) 2007లో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్నికల నిర్వహణకై ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా దేశంలో స్టూడెంట్ బాడీ ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ ఎన్నికలపై విధించిన నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థులు ఇందుకోసం ఉద్యమించాలి.– కోట ఆనంద్ విద్యార్థి నాయకుడు -
రోదన వెనుక కోట్ల వేదన
నారాయణా పాహిమాం : వివేకా శరణు పోరాడుతున్న పూర్వపు విద్యార్థుల సంఘాలు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆనం కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మంత్రి పొంగులేటి నారాయణ శరణు కోరడం వెనుక రూ.కోట్లు విలువ చేసే వి.ఆర్. విద్యా సంస్థల ఆస్తుల వ్యవహారమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. నగరం నడిబొడ్డున వి.ఆర్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 16 ఎకరాలు, అందులోని భవనాల మార్కెట్ విలువ రూ.500 కోట్ల పైచిలుకే అన్నది అంచనా. విద్యా సంస్థల్లో 300 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది ఉండటం, విభిన్న పద్ధతుల్లో నెలకు సుమారు పాతిక లక్షల రూపాయల వరకు సముపార్జన ఉండటంతో వాటిపై పట్టు చేజార్చుకోకుండా ఉండటానికే ఆనం నానా పాట్లు పడుతున్నారనేది బహిరంగ రహస్యమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే మంత్రి నారాయణ వద్దకు వెళ్లి అంతలా బతిమలాడాల్సిన అగత్యం వివేకానందరెడ్డికి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అంటున్నారు. నారాయణా నన్ను రక్షించవా అంటూ వివేకా బుధవారం మంత్రిని వేడుకున్న తీరు.. ‘ఇందుకంటయ్యా! రాజకీయాలు, పదవులు అంటూ కోటీశ్వర్లు సైతం వెంపర్లాడుతుంటారు. ఏమైనా కానీ రాజకీయాల్లో భలే మజా ఉందయ్యా’..అని తన అనుయాయుల వద్ద మంత్రి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆనం సోదరుల మధ్య రగడ నెల్లూరు నగరంలో వి.ఆర్ విద్యా సంస్థలు అంటే ప్రస్తుతం ఆనం కుటుంబం గుర్తుకు వస్తుంది. అన్నదమ్ముల బిడ్డలైన ఆనం కుటుంబాలకు చెందిన వారి మ«ధ్య రగడ తలెత్తడం, వి.ఆర్. విద్యాసంస్థలకు సంబం«ధించి 1993లో పాలకమండలి ఎన్నికలు సహేతుకంగా జరగలేదని, ఆ కమిటీ ఎన్నికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కొంతకాలం కిందట తీర్పును వెలువరించింది. కమిటీని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించిన సంగతి తెలిసిందే. వి.ఆర్ విద్యాసంస్థలకు ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కమిటీ రద్దయిన పక్షంలో ఆనం సోదరులకు వి.ఆర్.పై పెత్తనం పోతుంది. తద్వారా ఆర్థికమూలాలు దెబ్బతింటాయి. దేవాదాయశాఖకు చెందితే... వి.ఆర్. విద్యాసంస్థల పూర్వపు పాలకవర్గం ఈ సంస్థకు చెందిన ఆస్తిపాస్తులను దేవాదాయశాఖకు రాసిచ్చింది. ఆరు నెలల కిందట దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రూ.18 లక్షలను ప్రస్తుత కమిటీ నుంచి కట్టించుకుంది. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను బట్టి విద్యాసంస్థల ఆస్తిపాస్తులన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే ఆనం సోదరులకు నగర రాజకీయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవని రాజకీయ పక్షాలతో సహా అన్ని వర్గాల అభిప్రాయం. వీటన్నింటి నేపథ్యంలోనే ఎలాగైనా సరే ప్రత్యేక అధికారి పాలనలోకి, దేవాదాయ శాఖ పరిధిలోకి విద్యా సంస్థలు వెళ్లకుండా చూడాలని వివేకానందరెడ్డి కాళ్లావేళ్లా పడుతున్నారని అధికారపార్టీ వాళ్లే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. నాడలా.. నేడిలా.. తనకు కావాల్సిన ఓ మహిళా మాజీ ప్రజాప్రతినిధి తరఫు వారికి మెడికల్ సీటు ఉచితంగా ఇవ్వాలని కళాశాల యజమాని నారాయణకు అప్పటి ఎమ్మెల్యే ఆనం వివేకా సూచించారు. సీటు ఇవ్వనందుకు తన ప్రతాపం చూపిస్తానంటూ హూంకరించి మీ కాలేజీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కార్పొరేషన్ అ«ధికారులను పంపి రెడ్‌టేప్ వేయించడం, కొంత భాగాన్ని పడకొట్టించడం చేశారు. అప్పట్లో ఈ సంఘటన నెల్లూరు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వద్దకు పి.నారాయణ వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నా తను చేయగలిగింది ఏమీ లేదని, వివేకానందరెడ్డి వద్దే ఏదైనా తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే వివేకా ఇంటి వద్ద ఆరు గంటల పాటు ఎదురుచూశాక ఆనం ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. ఇదంతా 2013 నవంబరులో జరిగింది. తాజాగా ఇదీ సంగతి... వి.ఆర్. విద్యాసంస్థల కమిటీ ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై అధికారపార్టీలో భాగస్వామి అయిన బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కళాశాల కమిటీని రద్దుచేసి ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మంత్రి వద్దకు వెళ్లి ‘సర్, ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మరెవరూ మమ్మల్ని కాపాడలేరు’ అంటూ కాళ్లా వేళ్లా పడి భోరున విలపించారు. 2013లో తనకు ఎదురైన సంఘటనను గుర్తుచేస్తూ రాజకీయాల్లో ఇంత మజా ఉంటుందా అయ్యా అని మంత్రి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి. -
ర్యాలీ నిర్వహించి తీరుతాం
-
ర్యాలీ నిర్వహించి తీరుతాం
⇒ రేపు డిక్లరేషన్ ప్రకటిస్తాం: కోదండరాం ⇒ ప్రభుత్వం, పోలీసులు రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండాలి ⇒ నిరుద్యోగ యువకులంతా పాల్గొనాలి.. ప్రభుత్వానికి బాధ్యతను గుర్తుచేయాలి సాక్షి, హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వం రెచ్చగొట్టినా శాంతి యుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహిస్తామని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఇప్పటి దాకా అనుమతించకుండా జిల్లాల్లో అరెస్టులకు పాల్పడుతోందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా కచ్చితంగా ర్యాలీని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలని యువతకు కోదండరాం సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోవద్దని, తెలంగాణ కోసం శాంతియుతంగా పోరా డినట్టే ఇది కూడా జరగాలన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించే సామర్థ్యం తమకు ఉందన్నారు. ర్యాలీకి ఇప్పటికే 30 విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని, అనేక యువజన సంఘాలు అండగా ఉంటామని చెప్పినట్టుగా వెల్లడించారు. నిరుద్యోగ యువ కులంతా ర్యాలీలో పాల్గొని, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తుచేయాలని పిలుపును ఇచ్చారు. ఫిబ్రవరి 22న డిక్లరేషన్‌ను ప్రకటి స్తామని, దీనికి సంబంధించిన అంశాలపైనా చర్చించామన్నారు. ర్యాలీ, సభకు సంబం ధించిన ఏర్పాట్లపై 15 సబ్‌కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వేదిక ప్రాంగణంలో అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ర్యాలీ పూర్తయ్యేదాకా నిద్రపోం ‘‘ర్యాలీని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా నిర్వహించి తీరుతం. పోలీసులను అనుమతించకుంటే ర్యాలీని ఎలా నిర్వహించాలో ఆలోచిస్తం. ర్యాలీ పూర్తయ్యే దాకా నిద్రపోం’’ అని కోదండరాం వ్యాఖ్యా నించారు. జేఏసీ ఆవిర్భావం తర్వాత ఎన్ని ఉద్యమాలు జరిగాయో, అవన్నీ ఎలా జరి గాయో అందరికీ తెలుసునన్నారు. ఇంకా నయం.. ఎవరెస్టుపై అనలేదు.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ర్యాలీ చేసుకోవాలని పోలీసులు చేస్తున్న ప్రతి పాదనలపై కోదండరాం ఘాటుగా స్పందిం చారు. ‘‘ఇంకా నయం. ఎవరెస్టుపై చేసుకోమ నలేదు. నిరుద్యోగులు తమ ఆవేదనను ప్రజలకు చెప్పాలని అనుకుం టున్నారు. ప్రజలకు తెలియాలంటే ప్రముఖ ప్రాంతాలను, అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ కూడా అంతే.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు దాకా ఇప్పటిదాకా ఎన్నో ర్యాలీలు జరిగాయి. అలాగే ఇది కూడా జరుగు తుంది. ఎక్కడో ఊరి బయట చేసుకోమని పోలీసు లంటే ఎలా సమంజసం?’’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. -
కీచక టీచర్లపై చర్యలు చేపట్టాలి
సిద్దిపేట జోన్: ఉపాధ్యాయుల ముసుగులో విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్పడిన కీచక టీచర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ]సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం డిప్యూటీ ఈఓ శ్యాంప్రసాద్‌రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సాయి ఈశ్వర్‌గౌడ్, రమేష్, ఆనంద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాలు అరికట్టాలి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సామాజిక హక్కుల సంఘం జిల్లా కార్యదర్శ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణవేణి విద్యా సంస్థలో పనిచేస్తున్న రాజారాంపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చొరవ చూపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కఠినంగా శిక్షించాలి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడు రామచంద్రంను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రాజలింగం, నాయకులు విజయ్, మధు, తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు రామస్వామి అజిజ్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట డీఎస్సీ, ఆర్డీఓ, డిప్యూటీ ఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు హరీశ్, సాయి, భరత్, లక్ష్మణ్, లింగం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత..!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ విద్యార్థి సంఘం షాపింగ్ కాప్లెక్స్ వద్ద సమావేశమైంది. ప్రతిగా మరో విద్యార్థి సంఘం సౌత్ క్యాంపస్ నుంచి ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్ హాస్టల్ వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు సంఘాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం మాయం కావడంతో మరో విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున ఏఎస్ఏ ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది విగ్రహాన్ని లోపలికి తీసుకురావద్దని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు ఫిర్యాదు హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మియాపూర్ ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన మేరకు.. హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలో కైలాసం అనే విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఆ తర్వాత మరోవిద్యార్థి అన్‌మోల్‌సింగ్‌ను సైతం అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆ సమయంలో ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఆస్పత్రి వద్ద ఉన్నాడు. అన్‌మోల్‌సింగ్‌ను చూపిస్తూ తనపై ఇతనే దాడి చేశాడని కైలాసం..సుశీల్‌కు చెప్పాడు. దీంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మేరకు సుశీల్‌కుమార్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేయగా...అన్మోల్సింగ్పై ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా ఈ అంశంపై హెచ్‌సీయూ జేఏసీ నాయకుడు ప్రశాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ విద్యార్థిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. అన్‌మోల్‌సింగ్ కూడా తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన.. పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ బలవన్మరణానికి పాల్పడి ఆరునెలలు పూర్తికావడంతోపాటు, కారంచేడు ఘటన జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్సిటీ విద్యార్థులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ చట్టం తీసుకురావాలని నినాదాలుచేశారు. -
ఆ కరపత్రాలు నిజమైనవే!
♦ దుర్గామాతను దూషిస్తూ జేఎన్‌యూలో లభ్యమైన పత్రాలపై రిజిస్ట్రార్ నిర్ధారణ ♦ నకిలీవంటున్న విద్యార్థి సంఘాలు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో సంఘ వ్యతిరేక శక్తులున్నాయనేందుకు రుజువులుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చూపిన కరపత్రాలు నిజమైనవేనని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్ మంగళవారం నిర్ధారించారు. వర్సిటీలో మహిషాసుర సంస్మరణ కార్యక్రమం సందర్భంగా దుర్గామాతను దూషిస్తూ కరపత్రాలు ప్రచురించారంటూ వాటిలోని అంశాలను లోక్‌సభలో స్మృతి చదవడం వివాదమవడం తెలిసిందే. కరపత్రాలకు సంబంధించి అప్పుడు స్థానికంగా పోలీసు కేసు నమోదైందని, వర్సిటీ నుంచి నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, తాను అప్పుడు రిజిస్ట్రార్ కాదు.. కనుక ఆ బృందం నివేదిక గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే, ఆ కరపత్రాలు, పోస్టర్లు నకిలీవని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఆ వీడియోల్లో మార్పులుచేర్పులు ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమ వీడియోల్లో రెండు పూర్తిగా అసలైనవి కావని, వాటిలో మార్పుచేర్పులు జరిగాయని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా.. సంబంధిత ఏడు వీడియోలను ఢిల్లీ సర్కారు ఫొరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్‌కు పంపించింది. వీటిలో రెండింటిలో ట్యాంపరింగ్ జరిగిందని పరీక్షల్లో తేలింది. జైలా? బెయిలా? కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మరోవైపు, జేఎన్‌యూ విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్లకు కోర్టు మంగళవారం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించింది. ‘కన్హయ్య మా వాడైనందుకు గర్విస్తున్నాం’ న్యూఢిల్లీ: జవహర్లాల్ నె హ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ తమ వాడైనందుకు గర్వపడుతున్నామని ఆయన మామ రాజేంద్ర సింగ్, సోదరుడు మణికాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మద్దతు చూస్తుంటే తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో సోమవారం రాత్రి విద్యార్థులను ఉద్దేశించి రాజేంద్ర సింగ్ మాట్లాడారు. తమ గ్రామస్తులు స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషర్లను ఎదిరించి పోరాడారని.. కన్హయ్య అలాంటి ఘనచరిత్ర ఉన్న గ్రామం వాడన్నారు. తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే మోదీ.. ఓ రైతు కొడుకు అయిన కన్హయ్యపై ఆరోపణలు వస్తుంటే ఏం మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. కన్హయ్యకు న్యూయార్క్ వర్సిటీ విద్యార్థుల సంఘీభావం కన్హయ్య కుమార్‌కు అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులు తమ సంఘీభావం తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, కూపర్ యూనియన్ విద్యార్థులు ఫిబ్రవరి 27న కన్హయ్యకు మద్దతుగా వర్సిటీ క్యాంపస్‌లో బైఠాయించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడం హక్కు అవుతుంది కానీ నేరం కాదని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ‘స్టాండ్ విత్ జేఎన్‌యూ’ పేరుతో పోస్ట్ చేసింది. -
జేయూలో అఫ్జల్ పోస్టర్ల సంచలనం
కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ రాతలు ♦ జాదవ్‌పూర్ వర్సిటీలో సంచలనం ♦ ఘటనతో తమకు సంబంధం లేదన్న విద్యార్థి సంఘాలు కోల్‌కతా: మంగళవారం అఫ్జల్‌కు అనుకూలంగా నినాదాలు.. బుధవారం కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలంటూ పోస్టర్లు. ఇదీ పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ వర్సిటీలో తాజా పరిస్థితి. జేఎన్‌యూలో అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయాలంటూ.. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిలీలో మొదలైన ఆందోళన.. పోస్టర్ల దాకా వెళ్లింది. ‘కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలి.’ అంటూ ‘రాడికల్’ గ్రూపు పేరుతో పోస్టర్లు వెలిశాయి. ‘దీనిపై విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమయ్యాను. వారంతా పోస్టర్ల వివాదానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు’ అని వర్సిటీ వీసీ సృజన్ దాస్ తెలిపారు. తాజా పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదన్నారు. మరోవైపు మంగళవారం అఫ్జల్ అనుకూల నినాదాలతో జరిగిన ర్యాలీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. కాగా, అఫ్జల్ అనుకూల నినాదాల ర్యాలీతో తమకేం సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ తెలిపింది. ‘ఎవరో ఒక వర్గం చేసిన పనికి మొత్తం జేయూ విద్యార్థులపై విమర్శలు సరికాదు. ’ అని ఓ పక్రటనలో ఎస్ఎఫ్ఐ తెలిపింది. అయితే.. ఫిబ్రవరి 15న జేఎన్‌యూ విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఫిబ్రవరి 16వ తేదీన కొందరు విద్యార్థులు ఆరెస్సెస్, మోదీ వ్యతిరేక నినాదాలతో అఫ్జల్ ఉరిని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, పోస్టర్ల విడుదలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
తమిళనాడులోనూ ‘రోహిత్’ ప్రకంపనలు
కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్ చెన్నై, సాక్షి ప్రతినిధి: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తమిళనాడులోనూ ప్రకంపనలు చెలరేగాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కోరారు. రోహిత్ ఆత్మహత్యను హిందూ మతోన్మాదుల హత్యగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పేర్కొన్నారు. వర్సిటీలోని అవినీతిని ప్రశ్నించి నందుకే రోహిత్‌ను సస్పెండ్ చేశారని పీఎంకే అధ్యక్షుడు రాందాస్ విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని తమిళ మానిల కాంగెస్ అధ్యక్షుడు జీకే వాసన్ కోరారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, చిరుతైగళ్ కళగం అధ్యక్షుడు తిరుమావళవన్ డిమాండ్ చేశారు. -
మంచి అభ్యర్థిని చూపిస్తే వైదొలుగుతా..
♦ అధికార, విపక్షాలకు వరంగల్ ♦ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ సవాల్ హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్షాలు తనకన్నా మంచి అభ్యర్థిని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వామపక్షాలు, ఉద్యమ, ప్రజా సంఘాలు బలపర్చిన అభ్యర్థి ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. రైతు, మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాలని అనుకుంటే ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులను నిలబెట్టకుండా తనకు సహకరించాలని అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతీ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను బలపరిచానని, అది ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకే అని అన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక నియంత పాలన, దొరల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కుల మతాలకు అతీతంగా ఎలా పోరాడామో వరంగల్ ఎన్నికల్లో అదే పోరాటస్ఫూర్తి కనబర్చి పార్టీలకు సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. 31న వరంగల్‌లో వామపక్షాలు, ప్రజా, ఉద్యమ, విద్యార్థి సంఘాలు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
అనాథలు బీసీ జాబితాలోకా?
అశాస్త్రీయమంటున్న కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ అధ్యయనం, జిల్లాల వారీ పరిశీలన లేకుండా,అనాథలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని కొన్ని బీసీ, విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలనీ, తమ అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుతున్నాయి. కేవలం బీసీ-ఏ జాబితాలో అనాథలను చేర్చినంత మాత్రాన సరిపోదని, రిజర్వేషన్ల శాతాన్నీ పెంచాలంటున్నాయి. అనాథల పేరిట ఇతర కులాల వారు తప్పుడు ధ్రువీకరణలతో ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు గండికొట్టే అవకాశముందంటున్నాయి. అందుకే వారికి బీసీ సర్టిఫికెట్‌ను తహసీల్దార్లు కాకుండా ఆర్డీఓ స్థాయి అధికారి ఇచ్చేలా ఉత్తర్వులు సవరణలు చేయాలని కోరుతున్నాయి. బీసీ-ఏ జాబితాలో వారిని చేర్చినా రాజకీయ రిజర్వేషన్లు వర్తించకుండా చూడాలంటున్నాయి. తమిళనాడు జీవో ప్రకారమే ఇక్కడా అనాథలను బీసీ కేటగిరీలో చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమిళనాడులో అనుసరిస్తున్న విధానమే మార్గదర్శకమైంది. అక్కడ అనాథలను బీసీ జాబితాలో పొందుపరచడంతో పాటు కేంద్రంలో ఓబీసీలుగా పరిగణించాలని కూడా సంబంధిత కమిషన్‌కు ఆ ప్రభుత్వం తెలిపింది. తమ విధానానికి మద్ధతుగా మూడు అంశాలను పేర్కొంది... ►పదేళ్ల వయసులోపు పిల్లలు తల్లితండ్రుల్ని కోల్పోయి, నిరాశ్రయులై ఉండాలి. ► వారి బాగోగులు చూసేందుకు చట్టపరంగా, ఇతరత్రా ఎవరూ లేనివారు. ► ప్రభుత్వం, అది గుర్తించిన సంస్థల స్కూళ్లు, అనాథ శరణాలయాల్లోనివారు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని తమిళనాడు సర్కార్ బీసీలుగా పరిగణిస్తోంది. ఇదే ప్రాతిపదికన ఇక్కడి అనాథలను కూడా బీసీ-ఏ(55) క్రమసంఖ్యలో వారిని చేర్చాలని తెలంగాణ ప్రభుత్వమూ నిర్ణయించింది. అయితే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ విషయాన్నే ఇక్కడ బీసీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అభ్యంతరాలు తెలిపితే పరిశీలిస్తాం బీసీ సంఘాల వారు అభ్యంతరాల ను రాతపూర్వకంగా తమకు తెలియజేస్తే పరిశీలిస్తామని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ వెల్లడించారు. గురువారం బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీసీ, విద్యార్థిసంఘాల ప్రతి నిధులు కలిసిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. అధ్యయనం లేకుండానా! విస్తృత అధ్యయనం చేయకుండా కేవ లం కేబినెట్లో నిర్ణయించి, జీవో విడుదల చేయడం సరికాదు. అనాథలంటే మాకూ సానుకూల దృక్ఫథమే ఉంది. ప్రభుత్వం గుర్తించిన సంస్థలంటే అవకతవకలకు ఆస్కారముంది. ప్రస్తుతం నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, ఐఏఎస్ లు పుట్టుకొస్తున్నారు. అందువల్ల ఎమ్మార్వోలు కాకుండా ఆర్డీఓలకు బీసీ సర్టిఫికెట్లు జారీచేసే అధికారమివ్వాలి. - జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీసంక్షేమసంఘం -
ఏయూ బంద్ ప్రశాంతం.. సంపూర్ణం
స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు ఆరుగురు విద్యార్థి నేతల అరెస్టు దశలవారీ ఆందోళన కొనసాగిస్తా మన్న విద్యార్థి సంఘాలు విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హక్కు కోసం గళం విప్పిన ఏయూ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులుకు విద్యార్థి లోకం బాసటగా నిలిచింది. వారిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై మండిపడింది. ప్రభు త్వ, ఏయూ ఉన్నతాధికారుల చర్యలకు నిరసనంగా ఏయూ బంద్ ను బుధవారం సంపూర్ణంగా, ప్ర శాంతంగా నిర్వహిం చింది. ప్రభుత్వం పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిం చింది. అరెస్టులతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కానీ విద్యార్థులు స్వచ్ఛం దంగా స్పందించి బంద్‌ను విజయవంతం చేశారు. దశలవారీగా తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బంద్ ప్రశాంతం: ప్రొఫెసర్లపై కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏయూ బంద్ బుధవారం ప్రశాం తంగా జరిగింది. బుధవారం ఉదయం 10గంటలకే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తరగతులను బహిష్కరించారు. అన్ని విభాగాల విద్యార్థులు ప్రొఫెసర్లకు సంఘీభావం ప్రకటించారు. తరగతులకు హాజరు కాలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు కొందరు మాత్రమే తరగతులకు హాజరయ్యారు. బంద్‌కు సహకరించాల్సిందిగా విద్యార్థి సంఘాల నేతలు వారిని కోరారు. సానుకూలంగా స్పందించిన విద్యార్థులు తరగతుల నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను విద్యార్థులు నిరసించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెబుతూ అందుకోసం పోరాటం కొనసాగిస్తామని నినదించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన యువభేరీ సదస్సులో ప్రొఫెసర్లు పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేక చర్య ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. యూజీసీ నిబంధనలను అతిక్రమించని ప్రొఫెసర్లపై ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఉన్నతాధికారుల ద్వారా వారికి నోటీసులు జారీ చేయించిందని ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం బంద్‌ను విఫలం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం ఉదయం నుంచే పోలీసులు ఏయూ క్యాంపస్‌లో మోహరించారు. హాస్టళ్లకు వెళ్లి మరీ విద్యార్థులను సున్నితంగా బెదిరించినట్లు తెలిసింది. ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. తాము ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. విద్యార్థి సంఘాల నేతలు కాంతారావు, చంద్రశేఖర్, ధీరజ్, జోగారావు, కల్యాణ్, స్వామిలను అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, హనోక్, రవిరెడ్డి తదితరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విద్యార్థి నేతలకు సంఘీభావం ప్రకటించారు. సీఐ వెంకటరావుతో మాట్లాడారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు విడిచిపెట్టారు. ఆందోళన కొనసాగిస్తాం: విద్యార్థి సంఘాలు బంద్‌తో ఆందోళనను విరమించేది విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తూ దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి సృ్మతి ఇరానీలకు పోస్టుకార్టులు, ఎస్ఎంఎఎస్లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్న తీరును కూడా వివరించనున్నారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్రం ఇచ్చిన హామీయే కాబట్టి దాని కోసం మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా విన్నవించనున్నారు. ఈ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. -
కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్‌టేకర్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్‌కు అనుకూలం గా కేర్‌టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్‌టేకర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
వైఎస్సార్ సీపీ స్టూడెంట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలోవిద్యార్థి సంఘాలు కడప రూరల్ : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు నేతలు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని, కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి, నేడు మాట మార్చడం తగదని హితవు పలికారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఈనెల 26వ తేదిన చేపట్టనున్న నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు బాసటగా నిలిచి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల కుటిల ఆలోచనలను, నిర్ణయాలను తిప్పి కొట్టడానికి విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు ప్రాంతమైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ మాట్లాడుతూ విభజన హామీలను పాలకులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి భవిష్యత్తే ఉండదన్నారు. హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు ప్రత్యేక హోదాకోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దస్తగిరి, నిత్య పూజయ్య, నాగార్జునరెడ్డి, అలీ, సనావుల్లా, సుభాన్ పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం
వేకువజామునుంచే కాంప్లెక్స్ వద్ద బస్సులు నిలుపుదల పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు మూతపడ్డ పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం వేకువజామునుంచే ఆందోళనకారులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని బస్సులు కదలనీయకుండా అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారంతా కాంప్లెక్స్ వద్ద బైఠాయించడంతో కాంప్లెక్స్ నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదు. ఉదయం 11గంటల వరకూ షాపులు తెరచుకోలేదు. సోమవారం సాయంత్రమే పలు విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుతో పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగానే మూతపడ్డాయి. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కూడా జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కాంప్లెక్స్ వద్ద బస్సులు కదలనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను జర్నలిస్ట్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అంతకుముందు వైఎస్సార్సీపీ నాయకులు రొక్కం సూర్యప్రకాశరావు, పొన్నాడ రుషి, కోరాడ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని లోక్‌సభలో ప్రకటించిన బీజేపీ అధికారం చేపట్టాక మాట మార్చడం సరికాదని మోసపూరితమేనని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి న్యూఢిల్లీలో ధర్నా నిర్వహించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ నాయకులు చాపర వెంకటరమణ, చిక్కాల గోవిందరావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించడంలో టీడీపీ, బీజేపీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా సాధించే వరకూ పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సతీష్, పుట్టా అంజనీకుమార్, పైడి రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్సింగ్ ఏపీకి ఐదేళ్ళు ప్రత్యేకహోదా ప్రకటించగా పదేళ్ళు కావాలని ప్రతిపక్షనేత వెంకయ్య చెప్పారని, ఇపుడు అదికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా న్యాయమైన డిమాండ్ అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టే ఇపుడు ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర బంద్‌లో టీడీపీ తప్ప మిగతా అన్ని పార్టీలూ బంద్‌కు మద్దతు తెలిపాయని, అంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం ఇష్టం లేదనే అర్థమన్నారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాల నరసింహమూర్తి, నంబాళ్ళ రాజశేఖర్, గంజి ఎజ్రా, టి.త్రినాథ్, కె.వి.ఎల్.ఎన్. ఈశ్వరి, ఆర్.సురేష్, జ్యోతిప్రసాద్, సీహెచ్.భాస్కర్, రౌతు సూర్యప్రకాశరావు, వామపక్ష పార్టీలకు చెందిన టేకి గోవిందరావు, రాజేశ్వరరావు, అప్పారావు, కిరణ్, జర్నలిస్టు ప్రతినిధులు గురుగుబెల్లి రాజేశ్వరరావు, సనపల నర్సింహులు, జి.వి.నాగభూషణరావు, ఎం.వి.మల్లేశ్వరరావు, పొడుగు రాజు, సింగూరు బాబ్జి, డోల అప్పన్న, డోల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఏపీకి ప్రత్యేకంగా నిర్వహించిన మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. బీ-కేటగిరీ భర్తీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కొద్దిసేపు ఆందోళన మినహా తొలిరోజు ప్రశాంతంగానే కౌన్సెలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీకి చేరుకున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చినవారి కోసం యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెల్త్ యూనివర్సిటీలోని కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పలకరించారు. హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో తొలి సీటును గుంటూరుకు చెందిన 16వ ర్యాంకర్ కె.గీతాశ్రీ తీసుకోగా, ఆమెకు మంత్రి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గీతాశ్రీ విలేకరులతో మాట్లాడుతూ న్యూరాలజిస్ట్‌ను కావాలన్నదే తన లక్ష్యమన్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అఖిలభారత విద్యార్థి సంఘ పరిషత్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘ నేతలు హెల్త్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. తొలుత వర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా గేటును తోసుకుని లోపలికి వచ్చారు. మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అవకతవలకు పాల్పడుతున్న ప్రైవేటు మెడికల్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కామినేనికి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. -
'సీఎం పాలన నియంతను తలపిస్తోంది'
-
'సీఎం పాలన నియంతను తలపిస్తోంది'
ఏఎన్‌యూ (గుంటూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన నియంతను తలపిస్తోందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమం ఉధృతమవుతోందని భావించి యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాలల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వటంపై శనివారం ఉదయం వర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహాలు, పరిపాలనాభవన్ వద్ద ధర్నా చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలనాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. రిషితేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలను అణచివేయటంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ మహిళలపై రక్షణ విషయంలో చూపాలన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాల బోర్డులను తొలగించటం రాజ్యాంగ విరుద్ధమని, ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటిని తొలగించవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి హక్కులనే కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరి గుడికి అనేక సార్లు వస్తున్న రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్.. పక్కనే ఉన్న యూనివర్సిటీకి మాత్రం రావటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా యూనివర్సిటీని సందర్శించి, పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కోరారు. బోర్డులు తొలగించటం లేదని ప్రకటించాలని రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌ను డిమాండ్ చేశారు. దీనికి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అమలు చేస్తున్నామని, తొలగించనని హామీ ఇచ్చే అధికారం తనకు లేదని చెప్పారు. విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నిర్ణయం మాత్రం వారిదేనన్నారు. మధ్యాహ్నంలోగా క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఉన్నాయని, వాటిని పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. సాయంత్రానికల్లా యూనివర్సిటీ వసతి గృహాలను ఖాళీ చేయించి పోలీసు అధికారులు గేట్లకు తాళాలు వేశారు. -
విద్యావనంలో ఆందోళనల అలజడి!
- ఓయూలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆందోళనలు - పోరుబాటలో పీజీ, పీహెచ్డీ విద్యార్థులు - డిమాండ్ల సాధన కోసం ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు... - ప్రభుత్వం మొండివైఖరి వీడాలని విజ్ఞప్తి ఉస్మానియా యూనివర్సిటీ: ప్రఖ్యాత ఉస్మానియా వర్సిటీ ఇప్పుడు ఆందోళనల నిలయంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓయూను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్టవేయడంతో విద్యావనం అలజడులకు నిలయంగా మారింది. అధికార పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ మినహా ఇతర విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ఉద్యోగులు సర్వత్రా ఆందోళన బాట పట్టారు. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, పరిశోధనలు చేసే పీహెచ్డీ విద్యార్థులు, చదవుకునే పీజీ విద్యార్థులు, సేవలందిస్తున్న ఉద్యోగులు యావత్తు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. అందరి ఉమ్మడి డిమాండ్..రెగ్యులర్ వైస్ చాన్సలర్‌ను, పాలక మండలి సభ్యులను నియమించాలనే.. వీటితో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయసు యూజీసీ నిబంధనల ప్రకారం 60 నుంచి 65కు పెంచాలని, బ్లాక్ గ్రాంట్స్ నిధులు పెంచాలని కోరుతున్నారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు సీఎం ప్రకటించిన రూ.7 కోట్ల భోజన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు, పదోన్నతులు కల్పించాలని పర్మినెంట్ ఉద్యోగులు పోరాడుతున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని టైంస్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం తొలుత వినతి పత్రాలు, సభలు, సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు, నల్లబ్యాడ్జీలతో నిరసన, రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయినా పట్టించుకోకపోవడంతో అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు జూలై నెల చివరి వరకు వివిధ రూపాలలో దీర్ఘకాలిక పోరాటాలకు పిలుపునిచ్చారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే యూనివర్సిటీ నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు విద్యార్థులు రంగం సిద్ధం చేశారు. చలో అసెంబ్లీ, సచివాలయం ముట్టడి, రైళ్లలో ప్రచారం తదితర ఆందోళన కార్యక్రమాలకు ఇప్పటికే విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి రాష్ట ప్రభుత్వ పాలనలో ఓయూకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదని సీనియర్ ప్రొఫెసర్, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రెగ్యులర్ వీసీ లేక గందరగోళం వందేళ్ల ఉత్సవాలను జరుపుకోబోతున్న ఓయూకు ఏడాది కాలంగా రెగ్యులర్ వీసీ లేకపోవడంతో క్యాంపస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ ఉద్యమ కేంద్రం ఓయూ సమస్యలు తీరి, అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయని విద్యార్థులు ఊహించారు. అందుకు భిన్నంగా విద్యార్థులతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ తీరుపై విద్యార్థి జేఏసీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉద్యోగుల ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూతో పాటు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ చాన్సలర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వర్సిటీల సమస్యలపై కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం ఓయూ ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి పాలనా భవనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు కంచి మనోహార్, పార్థసారధి, మల్లేష్, జ్ఞానేశ్వర్, అబ్దుల్ ఖదీర్‌ఖాన్, దీపక్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వీసీలు లేక ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యలు పేరుకపోయినట్లు తెలిపారు. పదోన్నతులు చేపట్టకుండానే 30 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వివరించారు. కార్యక్రమంలో ఎల్లమయ్య, ఓంప్రకాష్, సిద్దిక్బేగ్, ఖాజా మొయినుద్దీన్, అక్బర్‌బేగ్, శివశంకర్, ఎంఏ మహమూద్, భూమారావు, రమేష్, అవినాష్, లక్షినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనలో పేదలు విద్యకు దూరం
- విద్యార్థి సంఘాల దీక్షలో కాంగ్రెస్ - జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ర్టం లో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తు న్న దివాలాకోరు అసమర్థ పాల నతో పేదవర్గాలు విద్యారంగానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయం ఎదుట ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులను నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల నిరాహారదీక్షలు ఆదివారం కొనసాగాయి. ఎస్ఎఫ్ ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీవీ విద్యార్థి సంఘాల దీక్షల శిబిరంను నాయిని రాజేందర్‌రెడ్డి సందర్శంచి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం, సంబంధిత విద్యాధికారులు ప్రైవేటు, కార్పొరేట్విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు టి. విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకుడు ఈవీ శ్రీనివాస్, తెలంగాణ సాహి తీ సంస్థ జిల్లా కన్వీనర్ ఆనంద్‌కుమార్, టీఎస్యూటీఎఫ్జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకట్‌రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దొగ్గెల తిరుపతి, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి బోగి సురేశ్, తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధు, జిల్లా అధ్యక్షుడు జి.రమేష్, రాజేంద్రప్రసాద్, టీడీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సోమయ్య మాట్లాడారు. దీక్షల శిబిరంలో ఆయా విద్యార్థి సంఘాల బాధ్యు లు సీహెచ్ శ్రీకాంత్, ఎన్. రవీందర్, బి నర్సింహారావు,దుర్గం సారయ్య, బిర్రు సురేశ్, హరీష్, ప్రశాంత్, వేణు, రవికుమార్, రాజశేఖర్ కూర్చున్నారు. -
కూలుతున్న విద్యావృక్షం
కామారెడ్డి డిగ్రీ కళాశాల ఒకప్పుడు ప్రతిభావంతులకు నిలయం. ఇక్కడ చదివిన ఎందరో దీని కీర్తి ప్రతిష్టలను ఎల్లలు దాటించారు. ఇప్పుడు ఈ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా నిర్వహణ భారంగా మారింది. ఎందరికో జీవిత పాఠాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యావృక్షమది. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులతో అలరారుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఆ చదువులమ్మ చెట్టు నీడలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పల్లె నుంచి వచ్చినోళ్లయినా.. పట్నం పిల్లాడికైనా చక్కని విద్యాఫలాలను అందించింది. అలా చదువుకున్నోళ్లలో చాలామంది దేశ, విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో కొలువుదీరారు. ‘నీ డిగ్రీ ఎక్కడ చేశావ్..’ అని ఎవరైన అడిగితే.. ‘కామారెడ్డి డిగ్రీ కాలేజీలో..’ అని గర్వంగా చెప్పుకునేవాళ్లు. అలాంటి యాభయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల ఇప్పుడు దీన స్థితికి చేరుకుంది. చెప్పుకోవడానికి వందల ఎకరాల భూములున్నట్లేగానీ.. తన పేరిట ఒక్క ఎకరమైనా లేని దుస్థితి. దీంతో న్యాక్ గుర్తింపునకు నోచుకోక.. యూజీసీ నిధులూ రాక.. సరైన వసతులూ లేక.. స్వర్ణోత్సవాల వేళలో చావుకళతో నిట్టూరుస్తోంది. ఎందరెందరికో విద్యాబుద్ధులు పంచిపెట్టిన తనను ఆదుకునేవారు లేరా.. అన్నట్లుగా కన్ను ఆర్పకుండా ఎదురు చూస్తోంది. కామారెడ్డి ‘కాలేజీ’ కథ వందల కోట్ల ఆస్తులు ఉన్నా అనాథగా.. తన పేరిట ఎకరం భూమి కూడా లేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితంగా న్యాక్, యూజీసీ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి యూజీసీ నిధుల్లేవ్.. వసతుల కల్పన దేవుడెరుగు స్వర్ణోత్సవ సంబురాల వేళలో చావు కళ కళ్లు తెరవకుంటే భవిత ఉండదంటున్న మేధావులు ఉద్యమిస్తామంటున్న విద్యార్థి సంఘాలు కామారెడ్డి : ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 263 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఈ కళాశాల తనపేరున ఒక్క ఎకరమైనా లేకపోవడంతో ప్రభుత్వపరంగా అందాల్సిన నిధులు, ప్రోత్సాహకాలకు దూరమ వుతోంది. అన్నింటికి మించి యూజీసీ, న్యాక్ గుర్తింపునకు నోచుకోలేక పోయింది. ఫలితంగా కళాశాల అభివృద్ధికి రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకోవాల్సిన ఈ విద్యావృక్షం అందరూ ఉన్న అనాథలా తయారైంది. కాలేజీ పుట్టుక.. కామారెడ్డి.. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల కూడలి ఇది. జాతీయ రహదారితో పాటు రైల్వే మార్గం కలిగిన పట్టణమిది. అప్పట్లో ఇక్క డ విద్యావసతులు లేకపోవడంతో పదో తరగతితోనే చదువుకు ఫు ల్‌స్టాప్ పెట్టేవారు. అప్పట్లో కొంతమంది పెద్దలు మన ఊర్లో.. మన పిల్లల కోసం ఓ కళాశాల స్థాపించాలన్న ఆలోచనతో ముందుకు కదిలారు. వీరికి అప్పటి జిల్లా కలెక్టర్ బీఎన్ రామన్ సహకరించారు. బీఎన్రామన్ అ ధ్యక్షతన కేఆర్ రాజారెడ్డి, కేపీ రాజారెడ్డి, జి.విఠల్‌రెడ్డి, వి.నారాయణరావు, బాదల్చంద్, నర్సాగౌడ్ తదితరులు సభ్యులుగా ‘కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఏర్పాటైంది. గంజ్‌లో క్రయవిక్రయాలకు వచ్చే ధాన్యం, బెల్లంపై కొంత సుంకం విధించి, ఆ డబ్బును కళాశాల కోసం వెచ్చించారు. కొందరు రైతులు ఉచితంగా, మరి కొందరు డబ్బులకు ఇచ్చిన భూములు కలిపి.. మొత్తం 263 ఎకరాలను సేకరించారు. ముందుచూపుతో భారీ భవనాన్ని నిర్మించి, 1964 ఆగస్టు 10న ‘కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల’ పేరుతో ఎయిడెడ్ కళాశాలను ప్రారంభించారు. తొలుత బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. 1979లో బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫిషరీష్, బీఎస్సీ డెయిరీ, బీఏ రూరల్ ఇండస్ట్రీ వంటి అరుదైన కోర్సులు ప్రారంభించారు. స్వాధీనం చేసుకోవాలని తరువాతి కాలంలో విద్యార్థులు భరించలేని ఫీజులు, నియామకాల్లో అక్రమాలు.. ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థులు ఉద్యమాలు లేవదీశారు. చివరకు 1987లో కళాశాలను ప్ర భుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కొంతకాలానికి కళాశాల కమిటీ తిరిగి కోర్టుకు వెళ్లడంతో కళాశాల ఆస్తిని విద్యాకమిటీకి ఇవ్వాలని తీర్పును వెలువరించారు. దీంతో మళ్లీ కళాశాల సొసైటీ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఉద్యమాలు జరిగాయి. నాలుగేళ్ల క్రితం కళాశాల కమిటీ తమ వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వానికి అప్పగించింది. రికార్డుల్లో మాత్రం కళాశాల కమిటీ పేరే చెల్లుబాటవుతోంది. కరిగిపోతున్న భూములు.. కళాశాల కమిటీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కు పెద్దఎత్తున భూ పంపిణీ చేయడంతో ఇప్పుడు కేవలం 60ఎకరాలే మిగిలినట్లు తెలుస్తోంది. సబ్స్టేషన్లకు 12ఎకరాలు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలకు 6ఎకరాలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీకి 25ఎకరాలు, డెయిరీ కళాశాలకు 62ఎకరాలు, జూనియర్ కాలేజీకి 5ఎకరాలు, కర్షక్ బీఈడీ కాలేజీకి 5ఎకరాలు, సరస్వతీ శిశుమందిర్ కు రెండెకరాలు, ఫారెస్టు నర్సరీకి ఎకరం, టీవీ స్టేషన్ కు ఎకరం, జీవీఎస్ కాలేజీకి 5ఎకరాలు, స్టేడియం నిర్మాణానికి 11ఎకరాలు, పోలీసు స్టేషన్‌కు 2ఎకరాలు, హాస్టళ్లకు 23ఎకరాలు, పారిశ్రామిక వాడకు 20ఎకరాలు, మైనారిటీ కాలేజీకి రెండెకరాలు, మున్సిపల్ నీటిశుద్ధి, ట్యాంకులకు నాలుగెకరాలు.. తాజాగా పీహెచ్సీ భవనానికి 2ఎకరాలు కేటాయించారు. అలాగే ఆక్రమణలకు కూడా అడ్డులేకుండా పోయింది. యూజీసీ, న్యాక్ గుర్తింపు లేక రాష్ట్రంలోనే పేరొందిన కామారెడ్డి డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ యూజీసీ, న్యాక్ గుర్తింపు లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం కళాశాలను స్వాధీనం చేసుకుని మూడు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కాలేజీ పేరిట భూమి లేకపోవడంతో న్యాక్, యూజీసీ గుర్తింపు దక్కడం లేదు. దీంతో కళాశాలలో స్పోర్ట్స్, అకడమిక్, లైబ్రరీ, భవనాల నిర్మాణం, లాబోరేటరీలు, ఆడిటోరియం, హాస్టల్ భవనాలు... ఇలా ఎన్నింటికో రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. కాలేజీ ఏర్పడి యాబై ఏళ్లవుతున్న సందర్భంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. కాని ఇక్కడ కాలేజీని పట్టించుకునేవారు లేక, ఏ గుర్తింపులేని పరిస్థితుల్లో అనాథలా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎన్నోఏళ్లుగా నిరాదరణకు గురైన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలంగాణ రాష్ట్రంలోనైనా తగిన గుర్తింపు లభిస్తుందా.. అన్న ఆశతో ఇక్కడి విద్యాభిమానులు ఎదురు చూస్తున్నారు.