కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని
విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తమిళనాడులోనూ ప్రకంపనలు చెలరేగాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కోరారు. రోహిత్ ఆత్మహత్యను హిందూ మతోన్మాదుల హత్యగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పేర్కొన్నారు. వర్సిటీలోని అవినీతిని ప్రశ్నించి నందుకే రోహిత్‌ను సస్పెండ్ చేశారని పీఎంకే అధ్యక్షుడు రాందాస్ విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని తమిళ మానిల కాంగెస్ అధ్యక్షుడు జీకే వాసన్ కోరారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, చిరుతైగళ్ కళగం అధ్యక్షుడు తిరుమావళవన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులోనూ ‘రోహిత్’ ప్రకంపనలు
Published Thu, Jan 21 2016 1:59 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement