
కేసీఆర్ పాలనలో పేదలు విద్యకు దూరం
- విద్యార్థి సంఘాల దీక్షలో కాంగ్రెస్
- జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ర్టం లో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తు న్న దివాలాకోరు అసమర్థ పాల నతో పేదవర్గాలు విద్యారంగానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయం ఎదుట ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజులను నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల నిరాహారదీక్షలు ఆదివారం కొనసాగాయి.
ఎస్‌ఎఫ్ ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీవీ విద్యార్థి సంఘాల దీక్షల శిబిరంను నాయిని రాజేందర్‌రెడ్డి సందర్శంచి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం, సంబంధిత విద్యాధికారులు ప్రైవేటు, కార్పొరేట్‌విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు టి. విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకుడు ఈవీ శ్రీనివాస్, తెలంగాణ సాహి తీ సంస్థ జిల్లా కన్వీనర్ ఆనంద్‌కుమార్, టీఎస్‌యూటీఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకట్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దొగ్గెల తిరుపతి, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి బోగి సురేశ్, తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధు, జిల్లా అధ్యక్షుడు జి.రమేష్, రాజేంద్రప్రసాద్, టీడీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సోమయ్య మాట్లాడారు. దీక్షల శిబిరంలో ఆయా విద్యార్థి సంఘాల బాధ్యు లు సీహెచ్ శ్రీకాంత్, ఎన్. రవీందర్, బి నర్సింహారావు,దుర్గం సారయ్య, బిర్రు సురేశ్, హరీష్, ప్రశాంత్, వేణు, రవికుమార్, రాజశేఖర్ కూర్చున్నారు.