ర్యాలీ నిర్వహించి తీరుతాం | We will conduct rally for sure sayes kodandaram | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 21 2017 6:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

పోలీసులు, ప్రభుత్వం రెచ్చగొట్టినా శాంతి యుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహిస్తామని టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఇప్పటి దాకా అనుమతించకుండా జిల్లాల్లో అరెస్టులకు పాల్పడుతోందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా కచ్చితంగా ర్యాలీని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలని యువతకు కోదండరాం సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement