వాషింగ్టన్: జాతివివక్ష నెపంతో తనను జాబ్ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ సంస్థను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. ఫిలిప్స్ అనే మహిళ పని చేస్తున్న దుకాణంలో ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటి తర్వాత వారిలో ఒకరు దుకాణంలోని వాష్‌రూంని వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనుగోలు చేయన కారణంగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. అయితే తాము వ్యాపారం పని మీద ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని వాళ్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్ సిబ్బంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా.. అందుకు వారిద్దరూ నిరాకరించారు. చివరికి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం.. అది కాస్త వైరల్ కావడంతో తీవ్ర నిరసనకు దారితీసింది.
ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రీజినల్ మేనేజర్ షానన్ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించి.. దుకాణ మేనేజర్‌ను మాత్రం విధుల్లోనే ఉంచింది. రీజినల్ మేనేజర్ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి శిక్షించారంటూ ఆమె 2019లో స్టార్‌బక్స్‌పై దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్ జ్యూరీ.. స్టార్‌బక్స్ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది.
Comments
Please login to add a commentAdd a comment