నెల్లూరు(రెవెన్యూ): చెరువు లోతట్టు ప్రాంతంలో పంటల సాగుకు అనుమతివ్వాలని నెల్లూరురూరల్ మండలం సౌత్‌మోపూరునకు చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా కనుపూరు కాలువ నీటితో 150 మంది పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం సాగుకు అనుమతి ఇవ్వలేదన్నారు. రైతులు జీవనోపాధి కోల్పోయామన్నారు. అధికారులు స్పందించి పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సాగు భూములకు పట్టాలివ్వండి
పదేళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మం జూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొడవలూరు మండలం పెయ్యలపాళెం సీపీఐ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకుల మా ట్లాడుతూ పంటల సాగుకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.
టైలర్స్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేయాలి
టైలర్స్ వర్కర్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం టైలర్లను గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.కోటి ఫండ్ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు. ఫెడరేషన్‌ను పునర్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించాలి
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులను ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎస్‌కె.రెహనాబేగం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఇస్కాన్ సిటీకి మధ్యాహ్న భోజన కాంట్రాక్టు ముగుస్తున్నందున ఆ జీఓను రద్దు చేసి పొదుపు మహిళలకే పథకం అప్పగించాలన్నారు. యూనియన్ నాయకులు విజయమ్మ, విమలమ్మ, రాములమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో పని చేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ హమాలీలకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెం టనే ఇవ్వాలన్నారు. ఉదయగిరి, కావలి ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద హమాలీలు పని చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు.
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
Published Tue, Nov 18 2014 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement