
రాయల్ స్టార్‌బక్స్
టాటావారి స్టార్‌బక్స్ రుచులు సిటీవాసులకు తొలిసారి పరిచయం అయ్యాయి. చిక్కటి కాఫీతో పాటు చక్కటి కేక్స్, కుకీస్, మఫిన్స్, సాండ్‌విచ్ వంటి ఐటమ్స్ ఈ కాఫీ షాప్‌లో చవులూరిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటైన ఈ స్టోర్స్ జూబ్లీహిల్స్‌లో కొలువుదీరింది. ఇక్కడ జరిగిన స్టార్‌బక్స్ ఓపెనింగ్ సెర్మనీలో సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు. నమ్రతా శిరోద్కర్‌తో పాటు జూనియర్ మహేష్ గౌతమ్, చార్మి, హర్షవర్ధన్ రాదే తదితరులు ప్రారంభోత్సవంలో సందడి చేశారు.