coffee shop
-
ఆమె కోసమే కాఫీ: శర్వా
బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. 2008 సమయంలో తన కాఫీ షాప్‌లో అప్పట్లో హీరోలు రామ్‌చరణ్, అఖిల్‌తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
తాటిబెల్లం కాఫీ 100వ బ్రాంచ్.. ఓపెన్ చేసిన బిందుమాధవి (ఫోటోలు)
-
పైకి కాఫీ బార్ షాపు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
యలహంక(బెంగళూరు): కాఫీ బార్ పేరుతో అక్రమంగా హుక్కా బార్ నడిపిస్తున్న ముగ్గురిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. దేవనహళ్లి తాలూకా కన్నమంగళ గేటు సమీపంలో కాఫీబార్ పేరుతో హుక్కా బార్ నడిపిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. టెంపోను ఢీకొన్న కారు తుమకూరు: వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై వస్తున్న టెంపో ట్రావెలర్‌ను ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు మరణించారు. జిల్లాలోని కుణిగల్ దగ్గర బేగూడరు వద్ద 75వ హైవేపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతులు బెంగళూరు సంజత్ నగరకు చెందిన రఘు (38), హెబ్బాల బీఎల్ సర్కిల్‌కు చెందిన విజయ్ (36), సంతోష్ (28)లు. కారు డ్రైవర్ లోకేష్‌తో పాటు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బెంగళూరుకు తరలించారు. టెంపోలో ఉన్న వసంత అనే మహిళకు కూడా గాయాలు తగిలాయి. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య.. -
‘నా పేరు ‘ఐసిస్’ కాదు’
వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత అమెరికాలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అయినప్పటకి కూడా అక్కడ ఇంకా కొంత మందిలో మార్పు రావడం లేదంటున్నారు నెటిజనులు. తాజాగా స్టార్‌బక్స్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఇది నిజమనిపిస్తుంది. కాఫీ కప్పు మీద ముస్లిం మహిళ పేరును ‘ఐసిస్’ అని రాసి విమర్శలు ఎదుర్కొంటోంది స్టార్‌బక్స్ యాజమాన్యం. వివరాలు.. ఆయేషా అనే ఓ ముస్లిం మహిళ ఈ నెల 1న అమెరికాలోని మిన్నెసోటా సెయింట్ పాల్లోని స్టార్‌బక్స్ బరిస్టాలో కాఫీ ఆర్డర్ చేసింది. తీరా కాఫీ కప్పు అందుకున్న ఆమె ఒక్క క్షణం షాక్‌కు గురయ్యింది. ఎందుకుంటే స్టార్ బక్స్ సిబ్బంది ఆయేషా పేరుకు బదులుగా ‘ఐసిస్’ అని కాఫీ కప్పు మీద రాశారు. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’) దీని గురించి ఆయేషా మాట్లాడుతూ.. ‘ముఖానికి మాస్క్ ఉండటంతో సరిగా వినపడదనే ఉద్దేశంతో నా పేరును చాలా సార్లు రిపీట్ చేశాను. అయినా వారు ‘ఐసిస్’ అని రాశారు. ఆయేషా అనే పేరు కొత్త కాదు. తరచుగా వినే పేరే. కావాలనే వారు ఇలా చేశారు. కప్పు మీద ఐసీస్ అని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. అవమానంగా భావించాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ప్రతిష్టను దిగజార్చే సంఘటన. ఈ రోజుల్లో కూడా జనాల ప్రవర్తన ఇలా ఉందంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఇది సరైంది కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆయేషా. అంతేకాక దీని గురించి మేనేజర్‌ను ప్రశ్నించింది. వారు ఈ సంఘటనను చిన్న తప్పిదంగా పరిగణించారు. ఆయేషాకు మరో కప్పు కాఫీ, 25 డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఈ చర్యలు ఆమె కోపాన్ని తగ్గించలేకపోయాయి. (హారియట్ టబ్‌మన్ బానిసల ప్రవక్త) దాంతో ఆయేషా స్టార్‌బక్స్ షాప్ మీద డిస్క్రిమినేషన్ సూట్ దాఖలు చేసింది. దాంతో సదరు షాప్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని తెలిపింది. ‘ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని మా నమ్మకం. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. ఇందుకు కారణమైన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. -
దారుణం.. ఎత్తుక్కెళ్లి మరీ రేప్ చేయబోయాడు
వాషింగ్టన్ : కాఫీ షాప్‌లో పని చేసే ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించటంతో బెదిరించి బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చివరకు ఎలాగోలా ఆమె అతని నుంచి తప్పించుకుంది. వాషింగ్టన్‌లోని కెంట్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ‘హాటీ షాట్స్ ఎస్ప్రెస్సో’ అనే ఓ కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్లైన్ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్ చేస్తుంటుంది(ఈ టైప్ రెస్టారెంట్లు అక్కడ సహజం). ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా.. కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లాడు. ‘చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచా. నేను అంత ప్రతిఘటిస్తానని బహుశా అతను ఊహించకపోయి ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు’ అని ఆమె ఆ భయానక ఘటనను గుర్తు చేసుకుంటోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడంట. కెంట్ పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ -
కాఫీ షాప్ నుంచి ఎత్తుక్కెళ్లి మరీ..
-
యోగా.. భలేగా!
షాపింగ్ మాల్, కాఫీ షాప్, రద్దీ లేని రోడ్డు, ఆఫీస్.. ఎక్కడైనా కావచ్చు ఒక్కసారిగా యోగాలవర్స్ అంతా ఒక్కచోటికి చేరుకుంటారు. యోగాసనాల్లోకి వెళ్లిపోతారు. మాబ్ డ్యాన్స్ల్లాంటి కొత్త ట్రెండ్ ఈ పాపప్ యోగా. ఇప్పటిదాకా యూరప్ దేశాల్లోనే ఉన్న ఈ ట్రెండ్ పొరుగునున్న మెట్రో సిటీస్‌లో మొదలు కాగా, ఇప్పుడిప్పుడే నగరానికి చేరుతోంది. ..:: కట్టా కవిత యోగా క్లాసుల్లో చేరేందుకు సమయంలేక... రోజూవారీ ఒత్తిడి నుంచి బయటపడలేక సతమతమవుతున్న వారికి ఉపయోగకరం ఈ పాపప్ యోగా. దీనికోసం యోగా స్టూడియోలు అక్కర్లేదు. యోగా మ్యాట్, డ్రెస్ అన్నీ చూసుకోనవసరం లేదు. రోజు మొత్తంలో మీకు వీలున్న సమయంలో సింపుల్ ఆసనాలతో, మెడిటేషన్ టెక్నిక్స్‌తో ప్రశాంతతను గెయిన్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. ఖాళీ ప్రదేశాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ మందికి యోగా ప్రయోజనాలను ఉచితంగా తెలియజేయాలన్నది ఇందులోని కాన్సెప్ట్. దీని ద్వారా యోగా లవర్స్‌ను ఒక్క దగ్గరిని తీసుకురావడంతో పాటు ఇంకో పది మందికి యోగాపై అవగాహన కలిగించవచ్చని నగరానికి చెందిన యోగా నిపుణులు అంటున్నారు. రీఛార్జ్... కంప్యూటర్ల ముందు కూర్చుని కోడింగ్, ఈ మెయిల్స్‌తో తల బద్దలు కొట్టుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇతర ఉద్యోగులకిది ఉపయోగపడుతుంది. అంతేకాదు గంటల తరబడి ఫోన్ మాట్లాడే కాల్‌సెంటర్ ఉద్యోగులు తొందరగా రీఛార్జ్ కావడానికి ఉపయోగ పడే సాధనం ఈ పాపప్ యోగా. అయితే ఖాళీ కడుపుతో చేసే ఆసనాలు కాకుండా ఏ టైమ్‌లోనైనా చేయగలిగే రిలాక్సేషన్, బ్రీథింగ్ ఎక్సర్‌సెజైస్, శవాసనం లాంటివి ఇందులోని ముఖ్య థీమ్స్. కాఫీషాప్‌లో ఆఫీస్ ఫ్రెండ్స్‌తో... న్యూఢిల్లీలోని ఓ పార్కులో నిధి ఖండూజా పాపప్ యోగా ప్రారంభించింది. యోగాను ఇష్టపడే కొద్దిమంది, వాళ్ల ఫ్రెండ్స్‌ను ఆహ్వానించి రోజూ ఉదయం, వీకెండ్స్‌లో యోగా చేశారు. కొత్తగా వచ్చిన వారు మళ్లీ వచ్చేటప్పుడు వాళ్ల ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చేవాళ్లు. ఇప్పుడు యోగాకు వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. ‘ఇద్దరా, ముగ్గురా, ఇరవై మందా అని ఆలోచించకండి... ముందు చేయడం ప్రారంభించండి’ అంటోంది నిధి. హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న నితిన్ తన ఆఫీస్ ఫ్రెండ్స్‌తో కలిసి కాఫీషాప్‌లో యోగా చేస్తున్నాడు. ‘ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్‌సెజైస్ చేస్తాం. తర్వాత మనసు ప్రశాంతంగా’ ఉంటుంది అంటున్నాడు నితిన్. యువత కోసం... యోగా అనగానే పెద్ద వయసువారు తెల్లటిబట్టల్లో ద్యానముద్రలో ఉన్నట్టు ఊహించేసుకుంటాం. కానీ యూత్‌ను ఎక్కువగా యోగావైపు ఆకర్షించడానికి చేసే ప్రయోగమిది. ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ కూడా పాపప్ యోగా క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. రోజంతా పని ఒత్తిడితో సతమతమైన వారు సాయంత్రం పూట ఒక్కచోట చేరి ఇలా చే యడం వల్ల మనసే కాదు శరీరమూ నూతనోత్తేజాన్ని పొందుతుంది. ప్రస్తుతం నగరంలో ప్రతి ఆదివారం జరుగుతున్న రాహ్‌గిరిలో కూడా యోగా భాగమైంది. యోగా ట్రైనర్ సంగీత అంకత దీన్ని ప్రారంభించారు. మొదట 10 మందితో ప్రారంభమైనా... సెషన్ చివరికల్లా 50 మంది వచ్చి చేరుతున్నారు. వీరిలో స్టూడెంట్స్, ఎంప్లాయీస్, కంపెనీస్ ఎండీలూ ఉంటున్నారు. పాపప్ యోగా కాన్సెప్ట్‌ను ప్రస్తుతం సిటీలోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఆఫీసుల్లో అప్లై చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. -
చల్లని కాఫీ
ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. ‘‘ఏ లాట్ కెన్ హాపెన్ ఓవర్ ఏ కాఫీ’’ - కాఫీ తాగే వ్యవధిలో గానీ, ఇక్కడ కాఫీ తాగటం వల్ల గానీ చాలా జరగవచ్చును అని పైవాక్యం తర్జుమా చేసుకుంటూ సదరు కాఫీషాపులోనికి అడుగపెట్టావు. నీకు కాఫీ తాగటం కొత్త కాదు. కాఫీ డే లాంటి ఖరీదైన కాఫీ షాపులూ కొత్త కాదు. కానీ, ఒక్కడివే రావడం కొత్త. ఒక స్త్రీ రమ్మంటే కాఫీ షాపుకి రావడం కొత్త. వచ్చి, ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చోవడం మరీ కొత్త! ఆమెను నువ్వు ఏడాదిగా ఎరిగినప్పటికీ ఏనాడూ ఆమెను కాఫీ షాప్‌కు నువ్వు తీసుకుని వెళ్లలేదు. నీ హాస్పిటల్లో ఓ నర్సుగా పరిచయమైన ఆమెను, నువ్వు చాలా గాఢంగా ప్రేమించావు. ఆమె కూడా నీ ప్రేమను అర్థం చేసుకుంది. ఇద్దరూ ఒకటౌదామనుకున్నారు. కానీ ఒకటవ్వగలరా? ఖాళీగా కూర్చుంటే బాగుండదని ‘బెల్జియం ఛాకో షాట్’ ఆర్డర్ ఇచ్చావు. ఈరోజు ఆదివారం సాయంత్రం కావడం చేత కాఫీడే యువతీ యువకులతో కళకళలాడుతుంది. ఒక్కసారి కాఫీ షాప్‌లో కూర్చున్నవారందరినీ పరిశీలనగా చూశావు. లింగ భేదం చూసే కళ్లకే గానీ జీన్స్ ప్యాంట్లకు, టీ షర్టులకు ఉండదు. నేటి ట్రెండ్‌కు ప్రతిబింబాలైన క్యాప్షన్లేవో టీషర్టులపై కొలువుదీరి నీవంటి రసజ్ఞుల చూపులను తమవైపునకు లాక్కుంటున్నవి. లెవీస్, పెపె, కిల్లర్, లీ కూపర్ తదితర జీన్సుల చిరుగుల్లోంచి నవీన నాగరికత ఉబికి పొంగుతోంది. నియాన్ బల్బుల కాంతి, చెవి పోగుల మెరుపును మరింత మెరుగ్గా చూపుతుంది. తలకు పెట్టిన బ్రెలిక్రీం స్పైక్స్‌ను బలంగా నిలబెట్టేందుకు మరింత దోహదపడుతుంది. హెయిర్ స్ప్రేల గుబాళింపో, డియోడ్రెంట్ల పరిమళమో తెలియదు గానీ వేల తుమ్మెదల దప్పిక తీర్చే సౌరభమేదో కాఫీ షాప్‌ను ఆవరించుకుంది. నిత్యం తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెతస్కోపు పెట్టుకు తిరిగే నీకు, వీళ్ల వేషధారణ కృత్రిమంగా తోచడంలో వింత లేదు. మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు, స్పిరిట్ల వాసనలు నిండిన నీ ముక్కుపుటాలు ఈ సుగంధ వీచికలను ఎక్కించుకుంటాయా? ఏదో ఆలోచనల్లో ఉన్న నువ్వు, నువ్వార్డరిచ్చిన ‘బెల్జియన్ చాకో షాట్’ రాకతో ఈ లోకంలోకి వచ్చావు. ఇంకా ఆమె రాలేదు. అసహనంగా నీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి మెసేజ్ ఇన్‌బాక్స్ తెరిచావు. ‘‘సారీ రామ్! మూడు రోజులుగా నిన్ను కలవడం గానీ, ఫోన్లో మాట్లాడటం గానీ, నీకు మెసేజ్ చేయడం గానీ కుదర్లేదు. రేపు సాయంత్రం ఆరింటికి గచ్చిబౌలి కాఫీడేకి రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి’’ ఆమె పంపిన అదే మెసేజ్‌ను నిన్నటి నుండి ఎన్నిసార్లు చదువుకున్నావో లెక్కేలేదు. టైం ఏడైంది. ఆమె ఇంకా రాలేదన్న అసహనంతో నీకు బీపీ పెరుగుతుండగా కాఫీడే తలుపు, నీ గుండె గవాక్షం ఒకే మాటు తెరుచుకున్నవి. రోమన్ల ప్రేమదేవత వీనస్, కాపర్ సల్ఫేట్ రంగు చీర కట్టుకుని వస్తున్నట్లుగా ఆమె ముగ్ధలా నడుస్తూ వచ్చి నీ టేబుల్లో నీ ముందు సీటుని ఆక్రమించుకుంది. ఆమె దర్శనంతో నీ బీపీ నార్మల్కు చేరింది. కళ్లు అరమోడ్పులయ్యాయి. ఆమె ఇంట్లో ఏం జరిగి ఉంటుందో నువ్వు ఊహించగలిగినా ‘‘ఏం జరిగిం’’దని ప్రశ్నించావు. ఆమె మౌనం వహించడంతో మళ్లీ అదే ప్రశ్న సంధించావు. ‘‘మన విషయం మా ఇంట్లో తెలిసిపోయిం’’దని చెప్పింది. ‘‘ఓస్! అంతేనా! ఎప్పటికైనా తెలియాల్సిందే కదా’’ అని తేలికపడ్డావు. ‘‘నన్ను ఎన్నెన్ని మాటలన్నారో తెలుసా?’’- నీ నిర్లిప్తత ఆమెకు నచ్చలేదు. ‘‘మా ఇంట్లోవాళ్లు నన్ను అంతకంటే ఎక్కువ అన్నారు. నేనేమైనా నీలా బాధపడ్డానా?’’ ఆమె పట్ల నీలో ఏ సానుభూతీ లేదు.‘‘అంటే! మీ ఇంట్లో కూడా మన విషయం తెలిసిపోయిందా?’’ ఆమె అమితమైన ఆశ్చర్యం ఒలకబోసింది. ‘‘తెలిసిపోవడమేవిటి? తెలియజెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇంట్లోవాళ్లందరినీ పిలిచి చెప్పాను’’ - నీ ముఖంలో ఏ భావమూ లేదు. ‘‘అప్పుడే ఎందుకు చెప్పావు? కొన్నాళ్లు ఆగి చెప్పాల్సింది’’ - మెనూ చూస్తూ ఆమె మెల్లగా పలికింది. ‘‘ఇంకెన్నాళ్లు? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. ఈ ఒంటరి జీవితం నావల్ల కాదు’’ - నీ దవడ కండరం బిగుసుకుంది. ‘‘ఇంతకూ మన విషయం తెలిశాక మీ ఇంట్లోవాళ్లు ఏమన్నారు?’’ - ఆమెలో ఆసక్తి వెల్లివిరిసింది. ‘‘మా ఇంటి పరువు తీశానన్నారు. నా ఆస్తి కోసం నువ్వు నన్ను వలలో వేసుకున్నావన్నారు. ఇకపై నలుగురిలో వాళ్లు తల ఎత్తుకు తిరగలేమన్నారు. ఇంకా చాలానే అన్నార్లే’’ - ముఖం వికారంగా పెట్టావు. ‘‘మా ఇంట్లో కూడా సేమ్ టు సేమ్’’ - ఆమె గలగలా నవ్వేసరికి నువ్వు కూడా శృతిగా నవ్వావు. ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ టేబుల్‌పై నువ్వు దరువేస్తుంటే ఆమె - ‘‘శేఖర్ కూడా ఇలాగే దరువేసేవాడు’’ అంది. ‘‘శేఖర్ పోయి ఇన్నేళ్లయినా నీకు అతను ఇంకా గుర్తున్నాడా?’’ అడగకూడని ప్రశ్న అడిగి తప్పుచేశావు. ‘‘ఏం? నీకు నీరజ గుర్తులేదా?’’ ఆమె ఈ ప్రశ్న నిన్ను అడుగుతుందని నీకు తెలుసు. ‘‘ఎందుకు గుర్తులేదు? ఆమె ఉన్నన్ని రోజులు నా జీవితం కలర్ఫుల్గా ఉండేది. దురదృష్టవశాత్తూ ఆమెను దేవుడు తీసుకుపోయాడు. తర్వాత నువ్వు పరిచయమయ్యావు. నీలో ఆమెను వెతుక్కుంటున్నాను’’ వెర్రిగా నవ్వావు. ‘‘నాకు కూడా అంతే! శేఖర్ అచ్చం నీలాగే ఉండేవాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శేఖర్ చనిపోలేదు. నీ రూపంలో బతికే ఉన్నాడని’’ - అనురాగం నిండిన ఆమె చూపులు నీ గుండెల్లో నాటుకున్నాయి. ‘‘అందుకే మనం పెళ్లి చేసుకోవాలి. మనం కోల్పోయిన ప్రేమను తిరిగి పొందాలి’’ నీ చెయ్యి ఆమె చేతిని సుతారంగా నిమిరింది. ‘‘మరి మన ఇళ్లలో ఒప్పుకోవడం లేదు!’’ అమాయకత్వం నింపుకున్న ఆమె కళ్లు నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ‘‘ఒప్పుకోకపోతే పోనీ! మన అవసరాలు వాళ్లకు అక్కర్లేకపోతే వాళ్లూ మనకు అక్కర్లేదు’’ నిశ్చయంగా ధ్వనించిన నీ గొంతులో ఏదో చిన్న వణుకు. ఆమె ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ బేరర్ చేతుల్ని రెక్కలుగా చేసుకుని ఎగిరివచ్చి నీ టేబుల్‌పై వాలింది. ‘‘శేఖర్‌కు కూడా నీలాగే కోపం ఎక్కువ కానీ మనసు మంచిది. నీకంటే ముందు నా జీవితంలో నన్ను అతను ప్రేమించినంత ఇంకెవ్వరూ ప్రేమించలేదు’’ కాఫీ సిప్ చేస్తూ అంది. ‘‘మా ఇంట్లోనూ అంతే! నీలాగా నన్నెవరూ ప్రేమించలేదు. అందరికీ నేను తెచ్చే డబ్బే కావాలి. నేను తిన్నానా, లేదా? ఉన్నానా, పోయానా ఎవరికీ అక్కర్లేదు. కనీసం నాతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడే తీరిక కూడా ఎవరికీ ఉండదు’’ - కాఫీలో షుగర్‌తో పాటుగా కోపం కూడా కలుపుతూ చెప్పావు. ‘‘రేపు మన పెళ్లయ్యాక కూడా నామీద ఇలాగే కోప్పడతావా?’’ ఆమె సందేహం సబబుగానే తోచింది నీకు. ‘‘ఛ! ఛ! నీమీద ఎందుకు కోప్పడతాను? నీతో చాలా సరదాగా ఉంటాను. వారానికి రెండు సినిమాలు చూద్దాం. రోజు విడిచి రోజు రెస్టారెంట్‌కు వెళ్దాం. నెలకోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దాం’’ - ఆమె ఇష్టంతో పనిలేనట్లుగా చెప్పుకుంటూ పోతున్నావు. ‘‘సరే. నీ ఇష్టం. కానీ నువ్వు స్మోకింగ్ మానెయ్యాలి. ఆదివారం మాత్రమే వోడ్కా తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. నేను చేసిన వంట ఎలా ఉన్నా మెచ్చుకుంటూ తినాలి’’ ఆమె స్వరంలో అధికారం ధ్వనించడం నీకు నచ్చింది. ‘‘సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్ఈడీ కొందామా?’’ - ఆమె సమాధానం కోసం నీ చెవులు ఎదురుచూస్తున్నాయి. ‘‘ఆలూ లేదు. చూలూ లేదు. అప్పుడే టీవీ గురించి ఎందుకు?’’ - ఆమె తియ్యగా విసుక్కుంది. ‘‘ఆలి ఉంది. ఆ రెండోది కూడా.’’ మిగిలిన వాక్యం పూర్తిచెయ్యకుండా కాఫీతో పాటు మింగేశావు. ‘‘ఛీ ఛీ! సిగ్గులేకపోతే సరి. పెళ్లీడుకొచ్చిన మనవలను పెట్టుకుని కూడా ఇలాంటి ఆలోచనలేవిటో!’’ నువ్వు మర్చిపోయినా ఆమె నీ వయస్సును గుర్తుచేసింది. సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్ఈడీ కొందామా? ‘‘అబ్బా! అక్కడికి తమరేదో యవ్వన ప్రాదుర్భావ దశలో ఉన్నట్లు! నీకు ఇంజనీరింగ్ చదువుతున్న ముగ్గురు మనవరాళ్లున్నారన్న సంగతి మర్చిపోయావేమో!’’ ఆమెను ఉడికిద్దామన్న నీ ప్రయత్నం ఫలించింది. కాఫీడేలో అందరూ మిమ్మల్నే గమనిస్తున్నారని నువ్వు చూడలేదు. నీకు అక్కర్లేదు కూడా. ఆమెతో ఉన్నంతసేపూ అనవతరంగా ఆమె ప్రేమను పొందాలన్న ఆబ నీది. ‘‘ఏవిటో! మన రోజుల్లో కాఫీ చల్లారిపోతే డబ్బులిచ్చేవాళ్లం కాదు. ఈ రోజుల్లో డబ్బు ఇచ్చి మరీ కోల్డ్ కాఫీ కొంటున్నాం! హా! హా! హా!’’ నీ హాస్య చతురతకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ‘‘ఇంక వెళ్దామా? తొమ్మిది కావస్తుంది’’ బిల్ కట్టేసి ఆమె వాచీ చూసుకుంది. రెండు మూడు గంటలుగా కూర్చోడం మూలాన నీ కాళ్లు పట్టేసినా నెమ్మదిగా లేచి నుంచునే ప్రయత్నం చేశావు. నీ నడక మొదలైంది. ఊతం లేనిదే నీవు నడవలేవు! ఓ చెయ్యి నీ చేతి కర్రపైన! రెండవది ఆమె భుజంపైన! నీ నడక సాగుతుంది. నీదే కాదు, తోడున్న ఏ నడకా ఆగిపోదు... శతమానం భవతిః - రిషి శ్రీనివాస్ -
రాయల్ స్టార్‌బక్స్
టాటావారి స్టార్‌బక్స్ రుచులు సిటీవాసులకు తొలిసారి పరిచయం అయ్యాయి. చిక్కటి కాఫీతో పాటు చక్కటి కేక్స్, కుకీస్, మఫిన్స్, సాండ్విచ్ వంటి ఐటమ్స్ ఈ కాఫీ షాప్‌లో చవులూరిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటైన ఈ స్టోర్స్ జూబ్లీహిల్స్‌లో కొలువుదీరింది. ఇక్కడ జరిగిన స్టార్‌బక్స్ ఓపెనింగ్ సెర్మనీలో సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు. నమ్రతా శిరోద్కర్‌తో పాటు జూనియర్ మహేష్ గౌతమ్, చార్మి, హర్షవర్ధన్ రాదే తదితరులు ప్రారంభోత్సవంలో సందడి చేశారు. -
నమ్మకమే జీవితం..
ద వాల్ట్.. అమెరికాలోని వ్యాలీసిటీ అనే చిన్న పట్టణంలో ఉన్న ఓ కాఫీ షాప్.. అన్ని షాపుల్లాగే.. ఇక్కడ మనకు కాఫీ, టీ, బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ దాన్ని మీకు అందివ్వడానికి మాత్రం ఎవరూ ఉండరు.. సెల్ఫ్ సర్వీసే.. అంతేకాదు.. కనీసం మీ బిల్లు ఎంతయింది అన్నది చెప్పడానికీ ఎవరూ ఉండరు. అదే సమయంలో మనం తిన్నదానికి డబ్బులు తీసుకోవడానికి కూడా.. అంటే.. ఎవరూ మిమ్మల్ని డబ్బులు అడగరన్నమాట. మరెలా నడుస్తుంది ఈ కాఫీ షాప్.. నమ్మకం మీద.. నిజాయితీ మీద.. ఈ కాలంలోనూ వీటిని నమ్ముకుని బిజినెస్ చేస్తారా అని అనుకోవద్దు. డేవిడ్ వీటిని నమ్ముకునే ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. తన కాఫీ షాపులోకి వచ్చే వారి నిజాయితీ మీద తనకు పరిపూర్ణ నమ్మకముందని.. అందుకే వేరే సిబ్బంది ఎవరినీ నియమించలేదని డే విడ్ చెప్పారు. ఇంతకీ ‘ద వాల్ట్’ ఎలా పనిచేస్తుందంటే.. మనం కాఫీ షాపులోకి వెళ్లాం.. కాఫీ లేదా టీ తాగాలనుకున్నాం.. కొన్ని బిస్కెట్స్, ప్రేస్ట్రీ తినాలనుకున్నాం. లోపలికి వెళ్లగానే.. అక్కడ కాఫీ, టీ తయారుచేసే యంత్రాలు ఉంటాయి. దాన్నుంచి.. మనకు కావాల్సినది మనం తయారుచేసేసుకోవడమే.. తర్వాత అక్కడే రెడీగా ఉండే బిస్కెట్స్, ప్రేస్ట్రీ తీసుకుని.. లాగించేయడమే.. తర్వాత మనం తిన్నదానికి బిల్లు ఎంత అయివుంటుందో లెక్కేసుకుని.. మనం మటుకు మనమే డబ్బులు కట్టేయాలి. చెక్కులకు వేరేగా.. నగదుకు వేరేగా బాక్సుల్లాంటివి ఉంటాయి. వాటిలో వేసేయడమే.. క్రెడిట్ కార్డు అయితే.. మెషీన్ వద్ద మనమే గీకాల్సి ఉంటుంది. ఈ కాలంలో అడిగితేనే సరిగా ఇవ్వడం లేదు.. అడక్కుండా ఎవరంత నిజాయితీగా డబ్బులు తమకు తామే కట్టేస్తారు అని అనుకోవచ్చు. అయితే.. అందరి అంచనాలు తప్పయ్యాయి. తన కస్టమర్ల నిజాయితీ మీద డేవిడ్‌కు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు. కొన్ని రోజుల తర్వాత తాము ఉంచిన సామాన్లకు అయిన ఖర్చు.. వచ్చిన డబ్బు లెక్కేస్తే.. లాభం పోగా.. మరో 15 శాతం ఎక్కువే వచ్చిందట. నిజాయితీ, నమ్మకం అనే పునాదులపై గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఈ కాఫీ షాప్ బ్రహ్మాండంగా నడుస్తోంది. -
భాషణం: ఓ కప్పు కాఫీ, నాలుగు మాటలు
ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఆహా! ఎంత ప్రియమైన పలకరింపు. మూడ్‌ని బట్టి ఏదైతే అది. ఇవాళ మాత్రం ప్రపంచం చాలావరకు కాఫీ మూడ్‌లోనే ఉంటుంది. సెప్టెంబర్ 29 ‘ఇంటర్నేషనల్ కాఫీ డే’ మరి! అంచేత కాఫీ గురించి ఓ కప్పుడు విషయాలు మాట్లాడుకుందాం. coffee klatch (కాఫీ క్లాచ్) అంటే కాఫీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకునే వారి గుంపు. klatch అనే మాట ఇంగ్లిష్‌లో లేదు. జర్మనీ నుంచి మన వాడుకలోకి వచ్చింది. వారి భాషలో క్లాచ్ అంటే గాసిప్. కాలక్షేపం కోసం తరచు కొందరు పోగయ్యే ప్రదేశాన్ని కూడా కాఫీ క్లాచ్ అనొచ్చు. ‘కాఫీ క్లాచ్’ కంటే కాస్త మెరుగైనది coffee morning.. ఇదొక సోషల్ ఈవెంట్. పెద్దపెద్దవాళ్లంతా ఒక చోట కలుసుకుంటారు. కాఫీ తాగుతారు. కేకులు తింటారు. ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తారు. coffee house అంటే రెస్టారెంట్. మధ్య, ఉత్తర ప్రాంత ఐరోపాదేశాల్లో ఈ కాఫీ హౌస్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. కాఫీతో పాటు ఇతర పానీయాలు, కేకులు, చిరుభోజనాలు కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు. కాబట్టి కాఫీ హౌస్ అంటే వట్టి కాఫీ మాత్రమే దొరుకుతుందనుకోనక్కర్లేదు. coffee bar అన్నా, coffee shop అన్నా కూడా ఇదే అర్థం. coffee table అంటే దిగువకు ఉండే చిన్నపాటి బల్ల. టీపాయ్ లాంటిది. దాని మీద కాఫీ సర్వ్ చేస్తారు. లేదా పుస్తకాలు, మ్యాగజీన్లు ఉంచుతారు. coffee-table book అని ఇంకో మాట ఉంది. దీనర్థం కాఫీ టేబుల్ మీద ఉండే పుస్తకం అని కాదు. అసలది కాఫీ టేబుల్ మీద ఉండాల్సిన పని కూడా లేదు. చాటంత ఉండే ఖరీదైన పుస్తకాన్ని కాఫీ-టేబుల్ బుక్ అంటారు. లోపలంతా చాలా వరకు బొమ్మలే ఉంటాయి. కనుక ఇది ప్రధానంగా చూడ్డానికే కానీ, చదవడానికి కాదు. Irish coffee అంటే తెలుసా? అందులో కాఫీ మాత్రమే ఉండదు. విస్కీ కూడా కలిసి ఉంటుంది! పై భాగాన చిక్కటి క్రీమ్ ఉంటుంది. సాధారణంగా దీనిని గ్లాసులో నింపి ఇస్తుంటారు. ఇవండీ... coffee కలిసిన కొన్ని పదబంధాలు. ఇక ఇండియమ్స్ అంటారా... పెద్దగా ఏం లేవు. బాగా వాడుకలో ఉన్నది మాత్రం wake up and smell the coffee. . అంటే... కళ్లు తెరిచి, నిజం చూడమని. ఇంగ్లిషు నవలలు చదివేవారికి తరచు coffee and అనీ, coffee and Danish అనీ రెండు మాటలు తగులుతుంటాయి. చదువుతున్న వారికి సందర్భాన్ని బట్టి వాటి అర్థం తెలిసిపోతుంది. coffee and అంటే కాఫీతో పాటు డోనట్, పేస్త్రీ కూడా లాగించారని. గ్ఛిWe stopped at a little shop for coffee andఅంటే కాఫీ మరియు వగైరా అని అర్థం చేసుకోవాలి తప్ప and తో వాక్యం ఎండ్ ఎలా అయిందని అనుకోనవసరం లేదు. coffee and Danish అన్నా కూడా ఇదే అర్థం. a cup of coffee and a Danish sweet roll అని. కాఫీతో పాటు డ్యానిష్ రోల్ తినే సంప్రదాయ కారణంగా ఈ నానుడి పుట్టింది. నల్లగా దెయ్యంలా... వేడిగా నరకంలా..! పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచి తత్వవేత్త ఓల్టేర్ రోజుకి యాభై కప్పుల కాఫీ తాగేవారట! కాఫీ అంటే అంత ప్రాణం ఆయనకు. ‘ఎందుకలా తాగుతారు? అది స్లో పాయిజన్ కదా’ అని సన్నిహితులు హెచ్చరిస్తే... ‘నిజమే. స్లో పాయిజనే. అరవై ఐదేళ్లుగా కాఫీ తాగుతున్నా... నేనింకా చనిపోలేదు’ అని నవ్వేవారట. ఓల్టేర్ 83 ఏళ్లు జీవించారు. ఫ్రాన్సులోనే ఓల్టేర్ కాలంలో టాలీర్యాండ్ అనే దౌత్యవేత్త ఒకాయన ఉండేవారు. ఆయనక్కూడా కాఫీ అంటే చచ్చేంత ఇష్టం. ఆయనకు మామూలు స్ట్రాంగ్ సరిపోదు. ‘‘కాఫీ అంటే ఎలా ఉండాలో తెలుసా? నల్లగా దెయ్యంలా, వేడిగా నరకంలా, స్వచ్ఛంగా దేవదూతలా, తియ్యగా ప్రేమలా’’ అని barista లకు క్లాసు పీకి... ఇప్పుడు చెప్పిన లక్షణాలతో కాఫీని తయారుచేసి పట్రమ్మనేవారట టాలీర్యాండ్. barista(బరిస్టా) అంటే కాఫీ తయారుచేయడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి. పెద్దపెద్ద రెస్టారెంట్లలో బరిస్టాలు ఉంటారు. బరిస్టా పేరుతో ప్రపంచవ్యాప్తంగా కాఫీ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మరి ఓల్టేర్లా, టాలీర్యాండ్లా కాఫీని నిర్విరామంగా గ్రోలుతుండే వారిని ఏమంటారు? cof-fee-hol-i-c-(s) అట!