సీసీటీవీ ఫుటేజీ దృశ్యం.. (ఇన్ సెట్‌లో మేడ్‌లైన్ గుయింటో)
వాషింగ్టన్ : కాఫీ షాప్‌లో పని చేసే ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించటంతో బెదిరించి బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చివరకు ఎలాగోలా ఆమె అతని నుంచి తప్పించుకుంది.
వాషింగ్టన్‌లోని కెంట్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ‘హాటీ షాట్స్ ఎస్‌ప్రెస్సో’ అనే ఓ కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్‌లైన్ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్ చేస్తుంటుంది(ఈ టైప్ రెస్టారెంట్లు అక్కడ సహజం). ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా.. కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లాడు.
‘చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచా. నేను అంత ప్రతిఘటిస్తానని బహుశా అతను ఊహించకపోయి ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు’ అని ఆమె ఆ భయానక ఘటనను గుర్తు చేసుకుంటోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడంట. కెంట్ పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
నిందితుడు మైకేల్ రేనాల్డ్స్
Comments
Please login to add a commentAdd a comment