భార్య సోదరి కోసం ఏం ఐడియా వేశాడు? | Bengaluru cops say man, sister-in-law hatched molestation plot to get married | Sakshi
Sakshi News home page

భార్య సోదరి కోసం ఏం ఐడియా వేశాడు?

Published Sun, Jan 8 2017 9:37 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

భార్య సోదరి కోసం ఏం ఐడియా వేశాడు? - Sakshi

భార్య సోదరి కోసం ఏం ఐడియా వేశాడు?

బెంగళూరు: బెంగళూరులో ఓ ఇద్దరు కలిసి పోలీసులను బోల్తా కొట్టించబోయారు. సీసీటీవీ కెమెరా పుణ్యమా అని ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కథనం చూస్తే ఎవరైనా అవక్కవ్వాల్సిందే. బెంగళూరులో ఓ వ్యక్తి తనకు భార్య ఉండగానే వదినను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఆమె కూడా సిద్ధమైంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కూడా ఉంది. అయితే వారి వివాహం ఆపేందుకు ఆమె తల్లిదండ్రులు మాత్రం ప్రయత్నించడం మొదలుపెట్టారు.

దీంతో ఎలాగైనా ఆమెను వివాహం చేసుకునేందుకు ప్రణాళిక రచించాడు. అతడి ప్లాన్‌కు వదిన కూడా సహకరించింది. తొలుత శుక్రవారం రోజు బెంగళూరులోని ఓ వీధిలో ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. మరోరోజు ఆమెకు గాయాలు అయినట్లు, గుర్తు తెలియని వ్యక్తులు తనను లైంగికంగా వేధించినట్లు గాయాలు చూపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఆమె వెళ్లిన వీధిలో సీసీటీవీ ఫుటేజీ తెప్పించారు. ఒక వీడియోలో ఆమె ఒంటరిగా నడిచి వెళ్లినట్లు ఉండగా మరో వీడియోలో అతడు ఆమెతో చాలా చనువుగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.

అతడిని ఆమె మరిదే అని గుర్తించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. ఆమెపై ఎవరైనా లైంగిక దాడి చేసినట్లు బయటకు తెలిస్తే ఇక ఆమెను చేసుకునేందుకు ఎవరూ రారని, దాంతో ఆమెను పెళ్లి చేసుకోవచ్చని, తన భార్య సానుభూతి కూడా పొందొచ్చని, పైగా అన్యాయం జరిగిన ఆమె సోదరిని చేసుకునేందుకు అంగీకరిస్తుందని భావించి ఇద్దరం ఈ ప్లాన్‌ చేసినట్లు తెలిపాడు. టీవీ సీరియల్‌ ద్వారా తాను ఈ ప్లాన్‌ తెలుసుకున్నానని చెప్పడం కొస మెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement