పుణేలో పసిపాపపై అఘాయిత్యం | 1-Year-Old Raped, Found With Head Smashed In Pune. Suspect Caught On CCTV | Sakshi
Sakshi News home page

పుణేలో పసిపాపపై అఘాయిత్యం

Published Sat, Jun 16 2018 11:40 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

1-Year-Old Raped, Found With Head Smashed In Pune. Suspect Caught On CCTV - Sakshi

సాక్షి, పుణే: అభం శుభం తెలియని మరో పసిపాప మృగాడి దురాగతానికి బలైపోయింది. అమ్మానాన్నల  పక్కన ఆదమరిచి  నిద్ర పోతున్న ఏడాది వయసున్న పసిపాపను ఎత్తుకెళ్లి  హత్యాచారానికి  పాల్పడ్డాడో కామాంధుడు.  పుణెలోని  లోనికాల్బార్‌ ప్రాంతంలో  ఈ విషాదం చోటు చేసుకుంది.  సీసీ టీవీ ఫుటేజ్‌ ​ఆధారంగా నిందితుడిని మల్హరి బాన్‌సోద్‌(22)గా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు  అతగాణ్ని అరెస్టు చేశారు. బుధవారం అర్థరాత్రి  పాపను ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు మల్హరి. అనంతరం పాప తలను నేలకోసి కొట్టి హత్య చేశాడని లోని కల్బర్ పోలీసు స్టేషన్  సీనియర్ అధికారి  వెల్లడించారు.

పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారని లోని కల్బార్‌ స్టేషన్‌ పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు  చేపట్టిన తాము శుక్రవారం తెల్లవారుఝామున  పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.  సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి  నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు  పోలీసులు పాపపై లైంగిక దాడి జరిగిందని  వైద్యులు పోస్ట్‌మార్టం నివేదకలో తేల్చడంతో ఆ వైపుగా పోలీసులు మల్హరిని విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.  పోక్సో చట్టం కింద  కేసు నమోదు చేశామన్నారు. కాగా బాధిత శిశువు తల్లితండ్రులు  తమిళనాడుకు చెందిన వారు. రోజుకూలీలుగా పనిచేస్తూ  పుణేలో జీవిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement