one year old girl
-
ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు.. చిన్నారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్..
పుట్టినరోజును ఎవరైన చాలా స్పెషల్‌గా జరుపుకోవాలనుకుంటారు. అందుకు ముందే కొత్తగా ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ మొదటి బర్త్‌డే అంటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవేం లేకుండానే ఓ చిన్నారి తన బర్త్‌డేని చాలా స్పెషల్‌గా జరుపుకుంది. ఎందుకంటే చిన్నారి పుట్టినరోజుని ఏకంగా ఇండిగో విమాన సంస్థే జరిపింది. బ్యూలా లాల్ అనే చిన్నారికి ఇండిగో విమాన సంస్థ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. చిన్నారి మొదటి పుట్టిన రోజునే విమానంలో ప్రయాణిస్తుందని తెలుసుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ముందస్తుగా బర్త్‌డే ప్లాన్ చేశారు. కరాచీ విమానాశ్రయానికి చిన్నారి రాగానే ఎయిర్‌లైన్స్ కెప్టెన్ మైక్ అందుకుని ఈ విషయాన్ని మైకులో అందరికీ ప్రకటించారు. చిన్నారితో కేక్ కట్ చేయించారు. విమాన ప్రయాణీకులందరూ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఈ వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చాలా మంచి అవకాశం అని స్పందించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. లాంగ్ లైఫ్, హ్యాప్పీగా ఉండాలని చిన్నారి సోషల్ మీడియా వేదికగా దీవించారు. View this post on Instagram A post shared by JOEL LAL J (@joellalj) ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?: వైరల్
కాన్బెర్రా : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిన్నారి తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరిగ్గా నడవటం చేతకాని వయసులో స్కేట్ బోర్డుమీదకెక్కి పచార్లు చేస్తోంది. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని క్లార్క్ ఫీల్డ్‌కు చెందిన కోకో హీత్ అనే చిన్నారికి ఐదు నెలల వయస్సులో స్కేట్ బోర్డు్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇది గమనించిన పాప తల్లి కెల్లీ చిన్నారిని అంత చిన్న వయస్సునుంచే స్కేట్‌బోర్డు మీద ఉంచి ఆడించేది. ప్రస్తుతం కోకో వయస్సు 14నెలలు. స్కేట్ బోర్డుపై కోకోకు పట్టువచ్చిన తర్వాత ఒక్కదాన్నే బోర్డుపై వదిలేసేది. చిన్నారి ఏ మాత్రం భయపడకుండా స్కేట్ బోర్డింగ్ చేయటం నేర్చుకుంది. 14 నెలల కోకో స్కేట్ బోర్డింగ్ చేయటం చూసిన చాలా మంది ఆశ్చర్యపోవటమే కాకుండా ఇంత చిన్న వయస్సులో ఎలా చేస్తోందంటూ నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా చిన్నారితో సెల్ఫీలు, ఫొటోలు దిగటానికి పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లనుంచి విశేషమైన స్పందన వస్తోంది. ‘‘ షూలకు గమ్ అంటించుకుందా ఏంటి?. అద్బుతంగా చేస్తోంది. అంత చిన్న వయస్సులో స్కేట్ బోర్డింగ్ చేయటం గొప్ప విషయం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాప నైపుణ్యానికి నెటిజన్ల ఆశ్చర్యం
-
పుణేలో పసిపాపపై అఘాయిత్యం
సాక్షి, పుణే: అభం శుభం తెలియని మరో పసిపాప మృగాడి దురాగతానికి బలైపోయింది. అమ్మానాన్నల పక్కన ఆదమరిచి నిద్ర పోతున్న ఏడాది వయసున్న పసిపాపను ఎత్తుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. పుణెలోని లోనికాల్బార్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని మల్హరి బాన్సోద్(22)గా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు అతగాణ్ని అరెస్టు చేశారు. బుధవారం అర్థరాత్రి పాపను ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు మల్హరి. అనంతరం పాప తలను నేలకోసి కొట్టి హత్య చేశాడని లోని కల్బర్ పోలీసు స్టేషన్ సీనియర్ అధికారి వెల్లడించారు. పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని లోని కల్బార్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన తాము శుక్రవారం తెల్లవారుఝామున పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు పాపపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదకలో తేల్చడంతో ఆ వైపుగా పోలీసులు మల్హరిని విచారించారు. దీంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా బాధిత శిశువు తల్లితండ్రులు తమిళనాడుకు చెందిన వారు. రోజుకూలీలుగా పనిచేస్తూ పుణేలో జీవిస్తున్నారు. -
ఏడాది బాలిక కడుపులో 3.5 కేజీల పిండం
కోయంబత్తూర్: 'ఫీటస్ ఇన్ ఫీటు' అత్యంత అరుదుగా కనిపించే ఈ వ్యాధి తమిళనాడులోని ఏడాది బాలికకు వచ్చింది. 'ఫీటస్ ఇన్ ఫీటు' అంటే పసి వయసులో బాలికల గర్భంలో పిండం పెరగడం. రోజూ వారీ కూలీలైన రాజు, సుమతి దంపతుల కుమార్తె నిషా. మామూలు పిల్లల్ల కాకుండా ఆమెకు పొట్ట పెరుగుతూ వస్తోంది. ఇది గమనించిన తల్లిదండ్రలు పట్టించుకోలేదు. ఆమె తీసుకునే ఆహారం మొత్తం పిండానికే సరిపోతుండటంతో.. నిషా శరీరంలోని భాగాలు క్రమంగా క్షీణించడం మొదలుపెట్టాయి. దీంతో కంగరూ పడిన తల్లిదండ్రులు ఆమెను ఎరోడ్ లోని ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. నిషా పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆయన మెట్టుపలయామ్ లోని పిడియాట్రిక్ సర్జన్ డా. విజయగిరి ని కలవాలని ఆమె తల్లిదండ్రలకు సూచించారు. డాక్టర్ సూచనలను పరిశీలించిన తర్వాత విజయగిరి బాలిక కడుపులో కణితి ఉందని భావించారు. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించిన విజయగిరి షాక్ కు గురయ్యారు. బాలిక పొట్టలో ఎముకలతో ఉన్న పిండం ఉందని గుర్తించారు. అత్యంత అరుదుగా కనిపించే 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పరిగణించిన ఆయన బాలికకు సర్జరీ చేసి పిండాన్ని బయటకు తీశారు. బాలిక నుంచి పిండాన్ని వేరు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్ తెలిపారు. పిండం బాలిక శరీరంలోని ఎడమ కిడ్నీ, పెద్ద పేగు ఎడమ భాగం, క్లోమం, ప్లీహం లను గట్టిగా పట్టుకుని ఉండటంతో వేరు చేయడం రిస్క్ అయిందని చెప్పారు. ఇందుకోసం ఆర్గాన్లకు రక్త సరఫరా చేస్తున్న రక్తనాళాలను విడదీసి.. పిండాన్ని తీసేసిన తర్వాత యథాస్థానాల్లో ఉంచినట్లు తెలిపారు. బాలిక నుంచి వేరు చేసిన పిండం 3.5 కిలోల బరువున్నట్లు చెప్పారు. పిండంలో ఎముకలకు సంబధించిన ఆనవాళ్లు ఉన్నట్లు వివరించారు. ఆపరేషన్ తర్వాత బాలిక త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు. -
బోరుబావిలో పడిన ఏడాది చిన్నారి
రంగారెడ్డి జిల్లాలో ఓ బాలిక పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. లోక్యా నాయక్ అనే రైతుకు చెందిన పొలంలో ఈ బాలిక పడిపోయింది. గండేడు మండలం గోవింద్‌పల్లి తండాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలిక సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ పడిపోయింది. సొంత పొలానికి పక్కనే ఉన్న మరో పొలంలో ఉన్న బావిలో బాలిక పడిపోయింది. 14 అడుగుల లోతులో బాలిక ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జేసీబీని తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు 108 వాహనాలను రప్పించారు. మండల కేంద్రానికి ఈ తండా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతో ఆసల్యం కాకుండా ఉండేందుకు ముందే పిలిపిస్తున్నారు. పాపను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.