బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.
2008 సమయంలో తన కాఫీ షాప్‌లో అప్పట్లో హీరోలు రామ్‌చరణ్, అఖిల్‌తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment