ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? | How are elections arrangements? | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

Published Thu, Sep 27 2018 3:03 AM | Last Updated on Thu, Sep 27 2018 3:03 AM

How are elections arrangements? - Sakshi

గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు బుధవారం వేర్వేరుగా కలిశారు. గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలసిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం గవర్నర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ జితేందర్, ఐజీ సంజయ్‌కుమార్‌జైన్‌ బృందం ఆయనను కలిసింది. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. మావోయిస్టు పార్టీ ఏపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీని ఆదేశించారు. అభ్యర్థుల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా బందోబస్తు చర్యలు తీసుకోవాలని, రాజకీయ నేతల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement