
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంలా లేదని, కేసీఆర్ ఇంకా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌కు మద్దతు పలికేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని, మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ టీఆర్‌ఎస్ నేతలా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు, రేవంత్ రెడ్డిపై ఈడీ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించా రు.