
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల కేసీఆర్‌ను గద్దె దించేందుకు సీట్ల కోసం పంతాలు, పట్టింపులు వీడాలని మహాకూటమి భాగస్వామ్య పక్షాలకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు సూచించారు. సీట్ల విషయంలో పంతాలకు పోవద్దని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించడం అభినందనీయమని అన్నారు.
మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అబద్ధాల కోరని ప్రజలకు అర్థమైందన్నారు. బీసీలకు సంబంధించి ఢిల్లీ మీటింగ్‌కు పిలవకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను అడుగుతానన్నారు. తననే కాకుండా పొన్నాల, ఆనంద్ భాస్కర్‌లనూ ఈ మీటింగ్‌కు ఆహ్వానించకపోవడం తగదన్నారు.