
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకావాలంటూ గవర్నర్ నరసింహన్ పంపిన ఆహ్వానాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తిరస్కరించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ అంటే వ్యక్తిగతంగా తనకు గౌరవమేనని, కానీ ఆ హోదాలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తిగా ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment