
జ్యువెలరీ షాపులో టీ తాగుతున్న గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాతబస్తీలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించారు. ముందుగా చార్మినార్ కట్టడాన్ని తిలకించిన గవర్నర్, భవన అందాలకు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ట్రస్టీ శశికళ సన్మానించారు.
అనంతరం లాడ్‌బజార్‌లో గాజుల దుకాణాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడి నుంచి సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించి అం దులోని చారిత్రాత్మక వస్తువులను తిలకించారు. అనం తరం చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు. గవర్నర్ రాకతో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.