=ప్రశాంతంగా ముగిసిన ‘డిసెంబరు 6’
=మొఘల్‌పుర ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత
=నిర్మానుష్యమైన పాతబస్తీ రహదారులు
=అప్రమత్తత కొనసాగుతుంది: కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన ‘డిసెంబర్ 6’ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నగర వ్యాప్తంగా.. అడుగడుగునా పోలీసులే కనిపించారు. డిసెంబర్ 6 నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. దీంతో మధ్యాహ్నం వరకు వీధులన్నీ నిర్మానుష్యంగా మారి సెలవును తలిపించారుు. ఆ తర్వాత నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. ఇత ర విభాగాలకు చెందిన పోలీసులు బందోబస్తు విధులతో తలమునకలవగా... ట్రాఫిక్ పోలీసులు వాహనాల మళ్లింపులపై దృష్టి పెట్టారు.
డీజేఎస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న మొఘల్‌పురలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీజేఎస్ అధినేత మాజిద్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డీజేఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు 20 మంది వరకు ఉండగా... పోలీ సులు, విలేకరులు మాత్రం 80 మందికి పైగా ఉన్నారు. తూర్పు మండలంలోని సైదాబాద్‌లోనూ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పాతబస్తీతో పాటు తూర్పు, పశ్చిమ మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర కమిషనర్ అనురాగ్ శర్మ ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. గురువారం రాత్రి నుంచి తనిఖీలు నిర్విరామంగా జరి గారుు. పాతబస్తీలో ఎలాంటి నిరసన, వివాదం తలెత్తినా రాళ్లు రువ్వడం ప్రధాన సమస్యగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుకున్న పోలీసులు మున్సిపల్ అధికారుల సహాయంతో మూడు రోజుల ముందు నుంచీ రోడ్లకు ఇరువైపులా ఉండే రాళ్లను తొలగించారు. భద్రతా చర్యల్లో భాగంగా కీలకమైన అన్ని ప్రాంతాలలో తనిఖీలు, గస్తీ ముమ్మరం చేశారు.
ప్రధాన వీధులలో నిరసన ర్యాలీ లు, నల్ల జెండాల ఏర్పాటు లేకుండా పక్కా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా అదనపు బలగాలను మోహరించారు. మక్కా మసీదులో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం మొఘల్‌పుర ఫైర్ స్టేషన్ వద్ద కొందరు యువకులు నినాదాలు చేయడంతో పాటు రాళ్లు రువ్వారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు, కొందరు అగ్నిమాపకశాఖ అధికారులతో పాటు దాదాపు ఏడుగురు గాయపడ్డారు. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చార్మినార్ పోలీసుస్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
పాతబస్తీ సహా నగర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గస్తీ, తని ఖీలను కొనసాగిస్తామన్నారు. సిటీలో శాంతి భద్రతలకు కాపాండేందుకు అంతా సహకరించారని, పీస్ కమిటీలు చేసిన కృషి తమకు ఎంతగానో ఉపకరించిందన్నారు. పాత నగరంలో శుక్రవారం జరిగిన అల్లర్లకు సంబంధించి మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో 3 కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఫలించిన పోలీసు వ్యూహం
Published Sat, Dec 7 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement