అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి | narasimhan new year wishes to telugu states people | Sakshi
Sakshi News home page

అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి

Published Sun, Jan 1 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి

అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి పౌరుడి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గవర్నర్‌ రాజ్‌భవన్ దర్బార్‌ హాల్‌లో సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులకు అందుబాటులో ఉండనున్నారని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement