సదస్సులో మహంతికి అవార్డును అందజేస్తున్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని 2025 నాటికి టీబీ లేని ఇండియాగా తీర్చిదిద్దాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన టీబీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ‘టీబీ సీల్ సేల్’ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ ఎంతో ప్రమాదకరమైన వ్యాధి అని న్నారు. టీబీ ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదన్నారు. కాబట్టి దీనిపై విస్తృ్తతమైన పరిశోధనలు జరపాలని వైద్యులను కోరారు. ఒక్కోసారి సాధారణ ఎక్స్‌రేతో క్షయను గుర్తించలేమని, అందుకోసం ఎంఆర్‌ఐ కూడా చేయాల్సి వస్తుందన్నారు. క్షయ రోగి నిత్యం మందులు వాడాలని, బలవర్థకమైన పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లోనే కాకుండా పట్టణాల్లోనూ టీబీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభలు పెట్టి ప్రజ ల్లో చైతన్యం పెంచాలని కోరారు.
పలువురికి అవార్డులు..
తెలుగు రాష్ట్రాల్లో టీబీ సీల్స్‌ను పెద్ద ఎత్తున విక్రయించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. మొదటి ఉత్తమ బహుమతిని గుంటూ రు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ అరుణ్‌కుమార్ క్రాంతి మహం తికి గవర్నర్ అందజేశారు. రెండో ఉత్తమ బహుమతి మహబూబ్‌నగర్ జిల్లా టీబీ అసోసియేషన్‌కు దక్కింది. ఈ బహుమతిని ఆ జిల్లాకు చెందిన ప్రతినిధికి అందజేశారు. విశాఖపట్నానికి చెందిన కేజియా మహంతికి కూడా అవార్డును ప్రదానం చేశారు.
ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రధానం
ప్రజాస్వామ్యంలో వాదనలు, చర్చలు, నిర్ణయాలు ముఖ్యమైనవని గవర్నర్ నరసింహన్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థపై శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన శ్రీలంక అధికారుల బృందం.. బుధవారం నియానాగే మామని జయవర్దనే నేతృత్వంలో గవర్నర్‌తో ప్రత్యేక భేటీ అయింది. వీరికి తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment