
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే కీలకమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తాన్ని ఖర్చు చేస్తోందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో నీటిపారుదల, విద్యుత్ రంగాలు ఉన్నాయన్నారు.
గురువారం దాదాపు 40మంది ప్రవాస భారతీయులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తోన్న ‘నో ఇండియా ప్రోగ్రాం’ (భారత్‌ను తెలుసుకుందాం)లో భాగంగా ఈ బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా నరసింహన్ బృంద సభ్యులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ మేరకు రెండు ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment