హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచిది కాదనీ, నీటి విషయంలో కలిసి ముందుకెళ్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎ కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 15 లక్షల జనాభాకు అనుగుణంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. 2018 తర్వాత తెలంగాణలో మంచినీటి కొరత ఉండదన్నారు. 2020 తర్వాత కరువు అనే మాట తెలంగాణ రాష్ట్రంలో వినపడదని తెలిపారు. 2024 కల్లా తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నీటి విషయంలో కలిసి ముందుకెళ్దాం: కేసీఆర్
Published Thu, Jun 2 2016 4:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement