తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలపై బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో పంచాయితీ జరుగనుంది
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలపై బుధవారం ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో పంచాయితీ జరుగనుంది. ఇందులో ప్రధానంగా సచివాలయం, నివాస భవనాల అప్పగింతపై చర్చించనున్నారు.
వీటితోపాటు షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, కోర్టు తీర్పుల అమలుపైనా మాట్లాడాలని ఏపీ పట్టుబట్టనుంది. ఏపీ తరఫున యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, కాలువ శ్రీనివాస్ తోపాటు ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు పెండింగ్ సమస్యలపై నోట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.