కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ సోమవారం సమావేశమయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈరోజు ఉదయం హస్తన
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ సోమవారం సమావేశమయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈరోజు ఉదయం హస్తిన బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పధంలో ముందుకు వెళుతున్నాయని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్య లేదని, అంతా ప్రశాంతంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రాల ప్రభుత్వ సంస్కరణలు త్వరలో ఫలితాలు ఇస్తాయని గవర్నర్ తెలిపారు.