
చంద్రబాబును కలిసిన జయప్రద
విజయవాడ: సినీనటి జయప్రద సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. క్యాంప్ కార్యాలయంలో ఆమె...చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే తన కుమారుడు సిద్ధార్థ వివాహానికి రావాల్సిందిగా జయప్రద ఈ సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించారు. కాగా నిన్న ఆమె...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివాహ పత్రిక అందచేశారు.
కాగా హైదరాబాద్ కు చెందిన ప్రవల్లికా రెడ్డితో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఇక సిద్ధార్ధ్ హీరోగా తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన. హన్సిక కథానాయికగా నటించింది.