హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ర్టంలో పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.
రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. ఈ నెల 27 నుంచి ఏపీ నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి సచివాలయాన్ని,శాఖాధిపతులను తరలించి పరిపాలన కొనసాగించేందుకు చేపట్టిన చర్యలు , తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, అనంతర పరిణామాలు తదితరాల గురించి గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
Published Sat, Jun 11 2016 9:19 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
Advertisement
Advertisement