
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక దీపావళి పండుగ అని ఆయన పేర్కొన్నారు. శాంతికి, మత సామరస్యానికి, సమాజ నిర్మాణానికి దీపావళి పండుగ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాక్షించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి వారి జీవితాల్లో కోటి కాంతులు వెదజల్లాలని ఆయన ఆకాంక్షించారు.
‘వచ్చే దీపావళి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ రాష్ట్ర ప్రజల్లో సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది దీపావళి పండుగ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే జరుగుతుందని అన్నారు.