
విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్ నరసింహన్
రాజాం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటిస్తున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాల, జీఎంఆర్ కేర్ ఆస్పత్రిను సందర్శించారు. జీఎంఆర్ ఐటీ కళాశాలలో విద్యార్థులతో నరసింహన్ కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన వెంట జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో పాటు అధికారులు ఉన్నారు.