హరితహారంలో భాగస్వాములు కావాలి: దత్తాత్రేయ
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో కలసి గ్రీన్‌డే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలు పునిచ్చారు. ‘హరిత పాఠ శాల– హరితతెలంగాణ’ నినాదంతో విద్యా శాఖ నిర్వహిస్తున్న గ్రీన్‌డేను శని వారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో కలసి ఆయన రాజ్‌భవన్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్యార్థు లను చిన్నప్పటి నుంచే మొక్కలు నాటేలా ప్రోత్స హించాలని, మొక్కలు నాటడమే కరువుకు సరైన పరిష్కారమని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈసారి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఇందులో వంద కోట్ల మొక్కలు అటవీ ప్రాంతంలో, 120 కోట్లు ఇతర ప్రాంతాల్లో, 10 కోట్లు హైదరాబాద్‌లో నాటాలని నిర్ణయించామన్నారు. మొక్కలు నాటడంతో పాటు హరితహారం, పర్యావర ణంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీ విజేతలకు ఆగస్టు 15న అవార్డులు అందిస్తామని కడియం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.