కరీంనగర్ రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును గవర్నర్ నరసింహన్ పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా ఆయన పదవికే కళంకం తెచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అత్యున్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్‌కు ప్రజలపై ప్రేమ ఉంటే సిరిసిల్లలోని చేనేత కార్మికులు, నేరెళ్ల బాధితులను పరామర్శించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment