
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా సీఎం గురువారం గవర్నర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి మధ్య రాజకీయ, పరిపాలనపరమైన అంశాలు చర్చకు వచ్చాయని, డిసెంబర్‌లోపు ఎన్నికలు జరిగే అవకాశముందని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.
మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యేల భేటీ...
అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్న మంత్రి కేటీఆర్ వినాయక చవితి నేపథ్యంలో రెండురోజులు ఈ ప్రక్రియకు విరామం ఇచ్చారు. టికెట్ దక్కిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కోనేరు కోనప్ప, చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, చెన్నమనేని రమేశ్‌బాబు, కల్వకుంట విద్యాసాగర్‌రావు తదితరులు కేటీఆర్‌ను కలిసి ప్రచారాంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని వారికి మంత్రి సూచించారు.