బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
గవర్నర్‌తో సీఎం భేటీ...
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదేనెల 16 లేదా 17న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ తో రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, ఇటీవలే ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశ వివరాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలను కూడా ప్రస్తావించినట్టు తెలిసింది.