హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు అయ్యేలా చూడాలని లంబాడి హక్కుల సమితీ గురువారం గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతోపాటు ఒన్ ఆఫ్ 70 యాక్ట్టు వంటి వాటిని వెంటనే అమలు అయ్యేలా చూడాలని వారు గవర్నర్ నరసింహన్ను కోరారు.
గవర్నర్‌ను కలిసిన బృందంలో గిరిజన నేతలు బలరాం నాయక్, రవీంద్రనాయక్, బెల్లానాయక్ ఉన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పలు హామీలు మ్యానిఫెస్టోలో పొందు పరిచిన సంగతి తెలిసిందే. వాటిని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. ఈ క్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నేతలు గవర్నర్ను కలిశారు.