
'గాంధీ జయంతి' కి రండి
గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు. గురువారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు గవర్నర్‌తో భేటీ అయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ, తీసుకున్న నిర్ణయాల గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది.