
పానకాలస్వామిని దర్శించుకున‍్న గవర‍్నర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): గవర‍్నర్ నరసింహన్ దంపతులు మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర‍్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన గవర‍్నర్ సతీసమేతంగా మంగళగిరి వెళ్ళి పానకాలస్వామిని దర్శించుకున్నారు.
అర‍్చకులు గవర‍్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగత పలికి దర‍్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు.