
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొరోగ్ చేయ డం వల్ల గత సెప్టెంబర్ 27న జరిగిన శాసనమండలి చివరి సమావేశంతో సెషన్ ముగిసింది. మళ్లీ గవర్నర్ నోటిఫికేషన్ జారీ తర్వాతే తదుపరి సెషన్ సమావేశాలు జరగనున్నాయి.