State Legislative Council
-
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బిహార్ సీఎం నితీష్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్‌తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది. చదవండి: 'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్ ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు. -
మోగిన నగారా.. మండలిలో అడుగు పెట్టే చాన్స్ ఎవరికో?..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు ఆదివారం విడుదలైంది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఔత్సాహికులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో పదవీ కాలం పూర్తి చేసుకున్న వారిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. మేలోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావించినా కోవిడ్ రెండోదశ విజృంభించడంతో వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదలైంది. మరోసారి అవకాశమా? గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల జాబితా చాంతాడును తలపిస్తోంది. పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించడంతో ఎవరికి వారు మండలిలో అడుగుపెట్టే అవకాశాలను లెక్క వేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పదవీ కాలం పూర్తవుతోంది. కేసీఆర్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశముంది. ఎవరికి వారే అంచనాలు... టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రులు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో పాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్ నుంచి హామీ పొందిన పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, పీఎల్ శ్రీనివాస్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఈసారి అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, క్యామ మల్లేశ్ వంటి వారు జాబితాలో ఉన్నారు. కౌశిక్‌రెడ్డి పదవికి ఆమోదం లభించేనా? హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేస్తూ మంత్రివర్గం ఆగస్టులో తీర్మానం చేసింది. అయితే కౌశిక్‌రెడ్డిపై పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి వివరాలను గవర్నర్ కోరినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తవడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్ ఆమోదించే విషయం మళ్లీ తెరమీదకు వస్తోంది. -
శాసన మండలి ప్రొరోగ్: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొరోగ్ చేయ డం వల్ల గత సెప్టెంబర్ 27న జరిగిన శాసనమండలి చివరి సమావేశంతో సెషన్ ముగిసింది. మళ్లీ గవర్నర్ నోటిఫికేషన్ జారీ తర్వాతే తదుపరి సెషన్ సమావేశాలు జరగనున్నాయి. -
మండలికి తప్పని ఎన్నిక
⇒ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ⇒ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో ఏడుగురు అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట శాసన మండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు. గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను మండలి ఎన్నికల అధికారి, శాసనసభా కార్యదర్శి రాజాసదారాం అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్‌కు ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒకవేళ ఆరుగురు అభ్యర్థులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవమయ్యేది. కానీ, టీఆర్ఎస్ ఐదో స్థానంపై కన్నేసి అభ్యర్థిని పోటీకి దింపడంతో ఎన్నిక తప్పడం లేదు. టీడీపీ నేతలకు గాలం! ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్ఎస్కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి గాలమేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్లు టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్ఎస్కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరుకాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరమన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు హాజరుకావద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా ఐదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ‘ఐదు’ కోసం టీఆర్ ఎస్ వ్యూహం ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకుతోడు, ఆంగ్లో ఇండియన్(నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే అధికార పార్టీ బలం 76కు చేరింది. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే ఆ పార్టీ చేతిలో 83 ఓట్లు ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్సీలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లు ఉంటాయి. ఐదో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్కు మరో ఏడు ఓట్లు అవసరమవుతాయి. దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇక బీజేపీ మద్దతిస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్థికి మరో రెండు ఓట్లు కావాలి. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్థికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రబోధం మేరకు నడుచుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటికే పిలుపునిస్తోంది.