
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను వెంటనే మార్చాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిన కొత్త గవర్నెర్‌ను ఎందుకు నియమించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడచినా గవర్నర్‌ను మార్చకపోవడం ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా ఇంతకుముందు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. నరసింహన్‌ను మార్చాలని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు కోరిన సంగతి విదితమే. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment