
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. ప్రముఖ పర్యావరణవేత్త వనజీవి రామయ్య, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరిస్తూ మంగళవారం రాజ్‌భవన్ ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, గవర్నర్ సలహాదారు ఎ.పి.వి.ఎన్. శర్మ, ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ దంపతులు, ఉప కార్యదర్శి ఎం.కృష్ణ, విద్యాసాగర్ కూడా మొక్కలను నాటారు.