
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా చేసిన గ్రీన్ చాలెంజ్‌ను సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వీకరించారు. గురువారం అన్నపూర్ణ స్టూడియోలో తన సిబ్బందితో కలసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని తన కోడలు సినీ నటి సమంత, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్, తమిళ నటుడు ధనుశ్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment