
శ్రీవారి సేవలో గవర్నర్
గవర్నర్ నరసింహన్ గురువారం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత పుష్కరిణిలో పుణ్యజలాన్ని ప్రోక్షణం చేసుకుని భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు.
అనంతరం కులశేఖరపడి నుండి పచ్చకర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పాదాలపై ఉంచిన పట్టు శేష వస్త్రాన్ని అర్చకులు గవర్నర్‌కు బహూకరించారు. అనంతరం నరసింహన్ వకుళమాతను దర్శించుకుని హుండీలో కానులు సమర్పించారు.
- సాక్షి, తిరుమల