నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యలమండలో డంపింగ్ యార్డును ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు.