Kotappakonda
-
జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ
కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయే టప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. తర్వాత ఏం జరిగింది? గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు కొత్తరెడ్డిపాలెం.. చిన్నపరెడ్డి స్వస్థలం. 1864లో జన్మించాడు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. అలా రెడ్డిపాలెం ‘రాబిన్‌హుడ్’గా ప్రసిద్ధుడయ్యాడు. భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక దివిటీ అయ్యాడు. బ్రిటిష్ పాలకులకు విరోధి అయ్యాడు. చదవండి: జైహింద్ స్పెషల్: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ ఎప్పుడూ ముందువరుసే మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాలు దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు. ఎడ్లు అడ్డుకున్నాయి! 1909 ఫిబ్రవరి 18న మళ్లీ కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయేటప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. అయిదు లక్షల జనం వచ్చిన ఆ తిరునాళ్లలో జనం రద్దీకి పోలీసులు లాఠీలు విసిరారు. ఎడ్లు బెదిరాయి. వారించిన చిన్నపరెడ్డిని పోలీసులు స్టేషనుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా పెంచి మాలిమి చేసిన ఎడ్లు దీన్ని పసిగట్టి ఎదురుతిరిగి అదుపుతప్పాయి. పోలీసులు కాల్పులకు దిగి ఒకదానిని కాల్చిచంపారు. ప్రజలు రెచ్చిపోవటానికి కారణం అదే అయింది. అంతకుముందు చిన్నపరెడ్డి అందించిన వందేమాతరం నినాదంతో పోలీసులను చితగ్గొట్టారు. ఈ గొడవంతటికీ కారణం చిన్నపరెడ్డేనని భావించిన పోలీసులు అతడిని అరెస్టుచేశారు. అక్కడే స్టేషనులో ఉంచారు. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఎగబడ్డారు. స్టేషను ముందున్న తాటాకు పందిరికి నిప్పంటించారు. నచ్చజెప్పేందుకు వచ్చి సత్రంలో ఉన్న డీఎస్పీని గాయపరిచారు. సబ్‌కలెక్టర్‌తో వచ్చిన దఫేదారును చితకబాదారు. సత్రానికి నిప్పంటించారు. సబ్‌కలెక్టర్, డీఎస్పీలు తప్పించుకున్నారు. ఈ రగడలో ఒక కానిస్టేబుల్, ఉప్పు శాఖకు చెందిన జవాను మరణించారు. జనసమూహంలో మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం ఈ అల్లర్లకు చిన్నపరెడ్డి, అతడి అనుచరులు కారణమని నమ్మిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనతోసహా వందమందిపై గుంటూరు అదనపు సెషన్స్ కోర్టులో కేసు (నెం.27/1909) నమోదు చేశారు. పోలీసుల గాలింపుకు దొరక్కుండా తన ఇంటిలోని భూగృహంలో దాక్కున్న చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి వివిధ కఠిన కారాగారశిక్షలు విధిస్తూ ఐషర్ కార్షన్ అనే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏ తప్పూ చేయని వారిక్కూడా శిక్ష పడిందన్న భావనతో చిన్నపరెడ్డి మద్రాస్ హైకోర్టులో అప్పీలు చేశారు. వాదిగా చిన్నపరెడ్డి, ప్రతివాదిగా బ్రిటిష్ చక్రవర్తిని చేర్చి 17/1910 విచారణ నంబరుగా ఇచ్చారు. హైకోర్టు న్యాయాధిపతులు మున్రో, శంకరన్ నాయర్లు విచారణ జరిపారు. 1910 ఆగస్టు 18న చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ముద్దాయిల తరపున న్యాయవాది ఎస్.స్వామినాధన్, ప్రభుత్వం తరపున టి.రిచ్మాండ్ వాదించారు. తర్వాత చిన్నపరెడ్డిని రాజమండ్రి తీసుకెళ్లి అక్టోబరులో ఉరితీశారు. కచ్చితమైన తేదీ తెలియరాలేదు. ఈ తీర్పును జీర్ణం చేసుకోలేని ప్రజలు గ్రామగ్రామాల్లో వందేమాతరం ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. చిన్నపరెడ్డి సాహసంపై బుర్రకథ, గేయాలు వచ్చాయి. స్వస్థలమైన చేబ్రోలు నుంచి 47 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కోటప్పకొండ సంఘటన, చిన్నపరెడ్డి పోరాటపటిమ ఆనాటి స్వరాజ్య ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచినట్టు ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు, ఇతర ప్రముఖులు తమ రచనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ ఆనవాయితీ బ్రిటిష్ హయాంలో చిన్నపరెడ్డి కారణంగా కోటప్పకొండ తిరునాళ్లలో పోలీసుక్యాంపు ఏర్పాటుచేసి, జిల్లా ఎస్పీ, కలెక్టరు అక్కడే మకాం వేసేవారు. ఇదే ఆనవాయితీ ఇప్పటికీ కోటప్పకొండలో కొనసాగుతోంది. ఈ సంప్రదాయం రాష్ట్రంలో మరే ఇతర తిరునాళ్లలో లేదు. కోటప్పకొండలో చిన్నపరెడ్డి ప్రభను నిలిపి మకాం చేసిన ప్రాంతం, ఎడ్లపందాల్లో పాల్గొన్న స్థలం ఇప్పటికీ జిల్లాపరిషత్ ఆధీనంలోనే ఉంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఎమ్మెల్యే విడదల రజని మరిది కారుపై దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో... ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారు. కారులో ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు ఉన్నారంటూ మాపై దాడి చేశారు. చిలకలూరిపేటలో మా పుల్లారావు కాకుండా మీరెలా గెలుస్తారని బెదిరించారు. మీ ఎమ్మెల్యే ఎలా తిరుగుతుందో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకుల దాడిలో మా కారు పూర్తిగా ధ్వంసం అయింది. దాడికి పాల్పడవారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’ అని తెలిపారు. కాపలా కాసి దాడులు చేస్తారా? టీడీపీ గూండాలను తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్యే విడదల రజని ఆరోపించారు. 200మందికి పైగా ఒకేసారి దాడి చేశారని, రాళ్లు, రాడ్లతో కారును ధ్వంసం చేశారన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాపలా కాసి దాడులు చేయడం కాదని, దమ్ముంటే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజాక్షేత్రంలో గెలవాలని ఎమ్మెల్యే రజని సవాల్ విసిరారు. -
పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కోటప్పకొండ సమీపంలో ఆదివారం బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ఆదిమూలపు సురేశ్ ఈ ఘటనను గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. 108ని పలిపించడమే కాకుండా.. దగ్గరుండి దంపతులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. -
టీడీపీ జెండాలతో కొండకు వచ్చిన ప్రభలు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద నిర్వహించే తిరునాళ్లకు వచ్చే ప్రభలపై రాజకీయ పార్టీల జెండాలు ఉంటే సహించబోం. అంటూ రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చేసిన హెచ్చరికలను టీడీపీ శ్రేణులు పట్టించుకున్నట్లుగా కన్పించలేదు. ఆయన ఆదేశాలను ఖాతరు చేయకుండా రెండు ప్రభల నిర్వాహకులు ఏకంగా టీడీపీ జెండాలతో తీసుకొనిరావటం గమనార్హం. సోమవారం కోటప్పకొండ వద్ద జరిగిన తిరునాళ్లకు సుమారు 11 విద్యుత్ ప్రభలు తరలిరాగా, వాటిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చిన యడవల్లి, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన ప్రభలు ఏకంగా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటుచేసి కొండకు తీసుకొచ్చారు. ప్రభలపై తెలుగుదేశం పార్టీ ప్రభ అంటూ బోర్డులను సైతం ఏర్పాటుచేయటం గమనార్హం. -
కోటప్ప కొండ వెనుక చరిత్ర
-
కోటప్పకొండలో వైఎస్సార్సీపీ ప్రభ
-
కోటప్ప కొండపై శివరాత్రి శోభ
-
శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కోటప్ప కొండ
-
కోటప్పకొండ తిరునాళ్లకు సన్నద్ధం
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి నరసరావుపేట రూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పండగగా నిర్వహించే కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లను జయప్రదం చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధం కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్ణానంగారి శ్రీహరి తెలిపారు. కోటప్పకొండలో ఆదివారం తిరునాళ్లలో ఆర్టీసీ ఏర్పాట్లపై డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 13 డిపోల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తిరునాళ్లకు హాజరయ్యే లక్షలాది యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ మార్గాల నుంచి ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌ల్లో ఇబ్బంది పడకుండా స్వామి వారిని దర్శించుకుని వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఘాట్‌రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రత్యేక బస్సులను వివిధ డిపోల నుంచి తిరునాళ్లకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 700 బస్సులను మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక బస్సులుగా నడిపినట్టు తెలిపారు. ప్రత్యేకించి కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 200 బస్సులు, చిలకలూరిపేట డిపో నుంచి 120 బస్సులతో పాటు ఘాట్‌రోడ్డు మార్గానికి 40 బస్సులను వినియోగించినట్టు వివరించారు. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా గతంలో కంటే అదనంగా బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, డిప్యూటీ సీటీఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎంఈ గంగాధర్, ఆర్టీసీ డీఎం వి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన కోటప్పకొండ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారి మూలవిరాట్‌కు విరివిగా అభిషేకాలు జరిగాయి. నాగేంద్రునడి పుట్ట, ధ్యానశివుడి విగ్రహం వద్ద కూడా విశేష పూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవో డి.శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కోటప్పకొండ(గుంటూరు): గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కోటప్పకొండ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కోటయ్యకు కొత్త శోభ
* రూ 3.50 కోట్లతో అభివృద్ధి * శివరాత్రి నాటికి భక్తులకు అందుబాటులోకి.. నరసరావుపేట రూరల్: ప్రముఖశైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరాలయంలో రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ గాలిగోపురం ముందున్న స్థలాన్ని విస్తరిస్తున్నారు. మల్టీపర్పస్ క్యూకాంప్లెక్స్, రిటైనింగ్ వాల్ తదితర నిర్మాణ పనులు ప్రారంభించారు. రానున్న శివరాత్రి పర్వదినం సమయానికి అయా పనులు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కోటప్పకొండకు ఇటీవల భక్తుల తాకిడి పెరిగింది. రాజధానికి సమీపంగా ఉండటంతోపాటు అతి పురాతనమైన మేధో దక్షిణామూర్తి స్వరూపంగా పరమశివుడు అవతరించిన ప్రాంతం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దీంతోపాటు అక్షరాభ్యాస కేంద్రంగా ఈ క్షేత్రానికి ప్రాచుర్యం ఉంది. కొనసాగుతున్న అభివృద్ధి పనులు... గాలిగోపురం ముందున్న స్థలాన్ని విస్తరించడంలో పాత త్రిముఖ శివలింగాన్ని తొలగించి కొత్త శివలింగాన్ని రూ.కోటితో ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం టీటీడీ స్తపతి ఇక్కడకు వచ్చి స్థల పరిశీలన చేసి వెళ్లారు. వీరి పర్యవేక్షణలో త్రిముఖ శివలింగం రూపుదిద్దుకోనుంది. మల్టీపర్పస్ క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని రూ.2.5 కోట్లతో చేపట్టనున్నారు. ఆలయం వెనుక వైపున ధనలక్ష్మి అతిథిగృహం పక్కన కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.. కోటప్పకొండలో 3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్రిముఖ శివలింగం, మల్టీపర్పస్ క్యూలైన్లు, రిటైనింగ్ వాల్ పనులు నిర్వహిస్తున్నారు. వేగంగా పనులు పూర్తి చేసి శివరాత్రి పర్వదినం నాటికి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాసరావు, డీఈ, దేవాదాయ శాఖ -
కోటప్పకొండ త్రైమాసిక ఆదాయం రూ. 20.6 లక్షలు
నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరునికి రూ.20,66,483 త్రై మాసిక ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ఆవరణలో శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత జులై నెల తొలిఏకాదశి మొదలుకోని మూడు నెలల హుండీ అదాయాన్ని అధికారుల పర్యవేక్షణలో భక్తసమాజం, స్కౌట్స్అండ్ గైడ్స్ వలంటీర్లు లెక్కించారు. లెక్కింపులో నగదుతో పాటు 21గ్రాముల బంగారం, 153 గ్రాముల వెండి, ఒక అమెరికన్ డాలర్‌ను భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నట్టు ఈవో తెలిపారు. కాగా గతేడాది కన్నా ఈ ఏడాది కార్తీకమాస ప్రారంభానికి రూ.3.86లక్షలు అధికంగా ఆదాయం అలయానికి లభించిందని వివరించారు. కొటంరాజుకొండూరు అమ్మవారి ఆలయ ఈవో పి.శ్రీనివాసరావు, యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, పొన్నూరు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధి డి.శ్రీనివాసరావు, ఆలయ ఈవో డి.శ్రీనివాసరావు, మహిళా భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. -
టూరిజం హబ్‌గా కోటప్పకొండ
సభాపతి కోడెల వెల్లడి నరసరావుపేట రూరల్: ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను కోటప్పకొండలో ఆభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి మంగళవారం ఆయన కోటప్పకొండను సందర్మించారు. సీసీఎఫ్ ప్రిన్సిపల్ రమేష్ కల్గాడి, వైల్డ్ లైఫ్ సీసీఎఫ్ రమణారెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్‌లు బిపిన్ చౌదరి, సీకే మిశ్రా, కౌశిక్‌లు సభాపతితో కలసి కోటప్పకొండ ఘూట్రోడ్డులోని పర్యాటక కేంద్రాన్ని పరిశీలించారు. ఘాట్ రోడ్డులోని బ్రహ్మ విగ్రహం ముందు భాగాన్ని అభివృద్ధి చేయాలని కోడెల సూచించారు. పర్యావరణ కేంద్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్‌ను యోగా సెంటర్‌గా మార్చాలన్నారు. కాళింది బోటు షికారులో నూతన బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పర్యావరణ కేంద్రాన్ని ఎవరు నిర్వహించాలి, టికెట్ ఎలా విక్రయించాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిధులు కొరత లేదని, దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు... శివరాత్రి నాటికి రూ.4.5 కోట్లతో కోటప్పకొండ అభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల తెలిపారు. రూ.కోటి వ్యయంతో పర్యావరణం పర్యాటక కేంద్రం, రూ.3.5 కోట్లతో ఆలయ అభివృద్ధి చేపడతామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీఎఫ్‌వో బ్రహ్మయ్య, డీఎఫ్‌వో మోహనరావు, డీసీఎఫ్ వై రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, బెల్లంకొండ పిచ్చయ్య, ఆలయ కమిటీ సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కోటప్పకొండలో గిరిప్రదక్షిణ
శివ నామంతో మార్మోగిన కోటప్పకొండ నరసరావుపేట రూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ వద్ద గిరిప్రదక్షిణ నిర్వహించారు. సెలవురోజు కావడంతో పాటు గిరిప్రదక్షిణ చేసే మార్గాన్ని శుభ్రం చేయడంతో గతంలో కంటే ఎక్కువమంది భక్తులు వచ్చారు. వీరిలో మహిళలే అధికం. తెల్లవారుజామున ఐదు గంటలకు మెట్ల మార్గంలోని వినాయకుడి గుడి వద్ద భక్తులు గిరిప్రదక్షిణను ప్రారంభించారు. నరసరావుపేట, చిలకలూరిపేటతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. శివ నామస్మరణతో కోటప్పకొండ మార్మోగింది. కాగా ఆలయ కమిటీ గిరి ప్రదక్షిణ చేసే దారిలో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. రాళ్లు ఉండడంతో చెప్పులు లేకుండా వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. ఆలయ కమిటీ సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి తాగునీరు ఏర్పాట్లు చేశారు. ఇకపై ఆలయ సమాచారాన్ని ముందుగా తెలియజేసేందుకుగాను గిరిప్రదక్షిణ చేసిన భక్తుల ఫోన్ నంబర్లను కమిటీ సభ్యులు సేకరించారు. -
త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
నర్సరావుపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటప్పకొండపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోటప్పకొండ ఘాట్‌రోడ్డులో పకృతి పర్యావరణ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అలాగే బ్రహ్మా, విష్ణు మూర్తి విగ్రహాలను ఆవిష్కరించి కాపు సత్రంలో కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. -
'సమీక్షలు జరిగినా చర్యల్లేవు'
కోటప్పకొండ: గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. వచ్చే నెల 7న శివరాత్రి మహోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంతవరకు తిరునాళ్ల ఏర్పాట్లకు సంబంధించి సరైన చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే అన్నారు. తిరునాళ్లపై ఇప్పటి వరకు రెండుసార్లు సమీక్షలు జరిగినా చర్యల్లేవన్నారు. తిరునాళ్ల సందర్భంగా ట్రాఫిక్‌జామ్ కాకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. సాగర్ కుడికాలవ నుంచి నీరు విడుదల చేస్తేనే భక్తులకు మంచినీటి సమస్య ఉండదన్నారు. -
అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం
నిదానంపాటి అమ్మ వారి గుడిలో ఆదివారం అదృశ్యమైన మగశిశువు ఆచూకీ కోటప్పకొండలో లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లిదండ్రుల నుంచి ఆడిస్తామని తీసుకుని వారు ఏమరపాటుగా ఉన్న సమయంలో బాలుడిని అపహరించారు. కోటప్పకొండలో దుండగుల వద్ద బాలుడిని చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు తెలపడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసులు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. -
కోటప్పకొండలో పురాతన మెట్ల మార్గం
గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది. కొండ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టిన సందర్భంలో శిథిలావస్థలో ఉన్న మెట్లు బయటపడ్డాయి. తాగునీటి ఎద్దడి నివారణకు కొండ కింద సంపు నిర్మించి కొండపైకి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొండపైకి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పోదలను తొలగిస్తుండగా ఇవి కనిపించాయి. కమ్మజన సంఘం సత్రం వెనుక వైపు నుంచి నేరుగా కొండమీదకు వెళ్ళే విధంగా కొండ రాళ్ళను మెట్లుగా అమర్చారు. వంద ఏళ్ల కింద వాడారు.. సోపాన మార్గంలో మెట్లను అభివృద్ధి చేసిన తరువాత ఈ దారి ఎవరూ వినియోగించక పోవడంతో.. ఈ ప్రాంత మంతా ముళ్ళ పోదలతో నిండిపోయింది. భక్తులు కోటప్పకొండకు చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన మార్గంతో పాటు డిఆర్డిఎ శిక్షణా కేంద్రం వెనుక వైపు నుండి మరో మార్గం ఉండేది. ఈ దారిని ఏనుగుల దారి అంటారు. కొండమీదకు అవసరమైన సామాగ్రిని ఏనుగుల ద్వారా కొండమీదకు తరలించే వారని చెబుతారు. అయితే తరువాత కాలంలో త్రికోటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న నరసరావుపేట జమీందార్లు నూతనంగా సోపాన మార్గం నిర్మించారు. దీంతో ఈ మార్గం గుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలక్రమంలో గతంలో ఉన్న రెండు మెట్ల మార్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బయటపడి న మెట్ల మార్గం పూర్తిగా కొండపైకి లేదు. కొండపైన అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన విస్తరణ పనుల్లో ఈ మార్గం మూతబడిపోయింది. కొండపైన ఇప్పుడు ఉన్న క్యాంటిన్ వెనక కొండరాళ్ళతో నింపి విస్తరించడంతో మెట్ల మార్గం దాని కిందకు వెళ్ళిపోయింది. బయటపడిన మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. -
కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యలమండలో డంపింగ్ యార్డును ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. -
'కోటప్పకొండ' ఘటన నిందితుడు అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయం వద్ద ఫిబ్రవరి లో ప్రేమికులపై దాడి ఘటనలో నిందితుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన బాజి(28) అనే వ్యక్తి ప్రేమికులపై దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలో కూడా నలుగురు యువతులపై లైంగిక దాడి చేసినట్టు విచారణలో తేలింది. బాజీని గతంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా, బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా ఫిబ్రవరి లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పీఆర్సీ తండాకు చెందిన బానోతు స్వాతి (18), మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన నాయక్(20) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. కోటప్పకొండ ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన ఇరువురూ మెట్ల మార్గంలో వెళుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచేయత్నం చేశారు. నాయక్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు అతణ్ణి పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్త్రావమై నాయక్ మరణించగా స్వాతి తీవ్ర గాయాలపాలైంది. -
ప్రేమికులపై దాడి.. ప్రియుడి మృతి
ప్రసిద్ధ కోటప్పకొండ ఆలయం మెట్ల మార్గంలో ఓ ప్రేమజంటపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రియుడు మృతిచెందగా, ప్రియురాలు తీ్వ్రగాయాలపాలైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పీఆర్సీ తండాకు చెందిన బానోతు స్వాతి (18), మాచర్ల మండలం శ్రీరాంపురం తండాకు చెందిన నాయక్(20) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం కోటప్పకొండ ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన ఇరువురూ మెట్ల మార్గంలో వెళుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచేయత్నం చేశారు. మొదట షాక్‌కు గురైనప్పటికీ తేరుకున్న నాయక్.. అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు అతణ్ణి పొడిచారు. దీంతో తీవ్ర రక్తస్త్రావమై నాయక్ మరణించాడు. ప్రస్తుతం స్వాతి నర్సారావు పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
కొత్త సూర్యోదయాన్ని చూసిన శివరాత్రి
ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. ‘సై సై చిన్నపరెడ్డీ! నీ పేరే బంగరు కడ్డీ!’ తెలుగు ప్రాంతంలో ఇప్పటికీ జనం నాలుకల మీద నర్తిస్తున్న పాట ఇది. కాలం గుర్తు పెట్టుకున్న వీరుడి మీద జానపదులు కట్టిన పాట ఇది. ఆయనే గాదె చిన్నపరెడ్డి. చరిత్రపుటలలో చిన్న స్థానానికే నోచుకున్నా, ప్రజల గుండెలలో ఆయన చిరస్మరణీయునిగానే ఉన్నాడు. భారతీయులను కలసి కట్టుగా కదిలేటట్టు చేసిన తొలి రాజకీయ నినాదం ‘వందేమాతరం’. బెంగాల్ విభజన నేపథ్యంలో 1905లో మిన్నంటిన ఆ నినాదమే దేశ ప్రజలను తొలిసారి రాజకీయంగా ఏకం చేసింది. వంగ సాహిత్యం మాదిరిగానే, వందేమాతరం ఉద్యమం ప్రభావం తెలుగు ప్రాంతాల మీద బలంగానే పడింది. అందుకు కారణం- 1906లో బిపిన్‌చంద్రపాల్ చేసిన పర్యటన. రాజమండ్రి, బెజవాడ, గుంటూరు, ఆపై మద్రాసు వరకు సాగిన పాల్ ఉపన్యాసాలు తెలుగువారిని ఉద్యమం దిశగా నడిపించాయి. జూలై 13, 1907న ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో మిట్టదొడ్డి వెంకట సుబ్బారావు బెంగాల్ విభజనను తీవ్రంగా విమర్శించారు. వెనుకబడిన కొత్తపట్నం వంటి చోట కూడా ‘లాలా లజపతిరాయ్కీ జై’ అన్న నినాదాలు మిన్నంటాయి. రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు తదితరుల ఉద్యమం, కాకినాడలో కెంప్ అనే అధికారికి వ్యతిరేకంగా జరిగిన అలజడి- అన్నీ అప్పుడే. ఆ తరువాత చరిత్రలో చోటు చేసుకున్న వీరోచిత ఘట్టమే కోటప్పకొండ శివరాత్రి ఉత్సవంలో చిన్నపరెడ్డి తిరుగుబాటు. గాదె చిన్నపరెడ్డి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వాడు. 1864లో జన్మించాడు. తండ్రి సుబ్బారెడ్డి, తల్లి లింగమ్మ. ఆయన గుర్రం మీదే మద్రాసులో కూనం న ది ఒడ్డున జరిగే సంతకు వెళ్లేవాడు. అలా వెళ్లినపుడే 1907లో బాలగంగాధర తిలక్‌ను చూశాడు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదంతో తన గ్రామాన్ని కదిలించాడు. రైతుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, నీలిమందు రైతుకు గిట్టుబాటు ధరకు కోసం పోరాటాలు చేశాడు. అప్పుడే జన హృదయ నేతగా ఆవిర్భవించాడు. కానీ పోలీసులకు మాత్రం సహించరాని శత్రువుగా మారాడు. ఆ నేపథ్యంలో జరిగినదే కోటప్పకొండ ఘటన. ఫిబ్రవరి 18, 1909, శివరాత్రి పర్వదినం. జిల్లాలో నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఉత్సవం జరుగుతోంది. అంబరాన్ని చుంబించినట్టు ఉండే ప్రభలు, అలంకరించిన ఎద్దులు ఈ ఉత్సవం ప్రత్యేకత. ఆ రోజు జరిగే సంత కూడా అప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నికగన్నది. చిన్నపరెడ్డి కూడా స్వగ్రామం నుంచి అరవై అడుగుల ఎత్తు ప్రభ కట్టుకుని, ఎడ్లతో తిరనాళ్లకు వెళ్లాడు. ఆ సంరంభంలో ఆయన ఎద్దులు అదుపు తప్పాయి. చిన్న తొక్కిసలాట జరిగింది. దీనితో పోలీసులు జరిపిన కాల్పులకు చిన్నపరెడ్డి ఎడ్లు చనిపోయాయి. దీనిని ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడే తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన పోలీసు స్టేషన్లో బంధించారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. వారి నోటి నుంచి వినిపించిన నినాదం - వందేమాతరం. పోలీసులు మళ్లీ కాల్పులు జరిపితే ఇద్దరు యువకులు మరణించారు. కోపోద్రిక్తులైన ప్రజలు తాటాకుల పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. చిన్నపరెడ్డితో పాటు మరో వందమందిపై కూడా కేసులు నమోదైనాయి. విచారణ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన శిక్షలు విధించాడు. అయితే ఈ తీర్పు ఇచ్చిన తరువాత అతడు పదవికి రాజీనామా చేశాడు. ఈ తీర్పును చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టులో సవాలు చేశాడు. కావాలంటే తనను శిక్షించి, మిగిలిన వారిని వదిలివేయమని ఆయన కోరాడు. ఆగస్టు 13, 1910న న్యాయమూర్తి మన్రో తీర్పు వెలువరించాడు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ వెంటనే శిక్షను అమలు చేశారు. స్వేచ్ఛకోసం, స్వాతంత్య్రం కోసం, న్యాయం కోసం ఇలాంటి త్యాగాలు ఆధునిక చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. కానీ ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా నిరోధించడానికి యత్ని స్తేనే మన త్యాగమూర్తులకు నిజమైన నివాళి కాగలదు. సందర్భం: చిట్టిపాటి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త సీపీఐ యంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు)